06-05-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - శరీర నిర్వహణార్థము కర్మలు భలే చేయండి కానీ కనీసము 8 గంటలు తండ్రిని స్మృతి చేసి విశ్వమంతటికీ శాంతిని దానము ఇవ్వండి. మీ సమానంగా తయారు చేయు సేవ చేయండి.'' 
ప్రశ్న :-
సూర్యవంశీ కుటుంబములో ఉన్నత పదవి పొందు పురుషార్థము ఏది

సమా :-
సూర్యవంశములో ఉన్నత పదవిని పొందాలంటే 1. తండ్రిని స్మృతి చేయండి, ఇతరులతో చేయించండి. ఎంతెంత స్వదర్శన చక్రధారులుగా అవుతారో, ఇతరులను తయారు చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. 2. పురుషార్థము చేసి గౌరవ పూర్వకముగా ఉత్తీర్ణులు అవ్వండి. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవీ చేయకండి. శిక్షలు అనుభవించే వారి పదవి భ్రష్టమైపోతుంది. 
పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి.......(ఇస్‌ పాప్‌ కీ దునియా సే,.........)   
ఓంశాంతి.
ఇది పిల్లలు చేయు ప్రార్థన. ఏ పిల్లలది? ఎవరైతే ఇంతవరకు బాబాను తెలుసుకోలేదో వారి ప్రార్థన. ఈ పాప ప్రపంచము నుండి బాబా మనలను పుణ్య ప్రపంచములోకి తీసుకెళ్తున్నారని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అచ్చట సదా సుఖమే సుఖముంటుంది. దు:ఖమనే మాటే ఉండదు. మేము ఆ సుఖధామము నుండి ఈ దు:ఖధామానికి ఎలా వచ్చాము? అని ఇప్పుడు మీ హృదయమును ప్రశ్నించుకోండి. భారతదేశము చాలా ప్రాచీనమైనదని అందరికీ తెలుసు. భారతదేశమే సుఖధామంగా ఉండేది. ఒకే భగవాన్‌ - భగవతీల రాజ్యముండేది. గాడ్‌ కృష్ణ, గాడెజ్‌ రాధ లేక గాడ్‌ నారాయణ, గాడెజ్‌ లక్ష్మి రాజ్యపాలన చేసేవారు. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ భారతీయులే స్వయాన్ని పతిత భ్రష్ఠాచారులమని ఎందుకు చెప్పుకుంటున్నారు. భారతదేశము బంగారు పిచుకలా ఉండేది. పారసనాథ్‌ మరియు పారసనాథినీల రాజ్యముండేది. ఈ భ్రష్టాచారి స్థితి ఎలా వచ్చింది? బాబా కూర్చుని తెలియజేస్తున్నారు - నా జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది కానీ నాది దివ్యమైన జన్మ. మేము శివ వంశీయులము, అంతేకాక ప్రజాపిత బి.కె.లమని మీకు తెలుసు. కావున బాబా తెలియజేస్తున్నారు - మొట్టమొదట గాడ్‌ ఫాదర్‌ ఎవరో తెలుసా? అని అడగండి. తండ్రి కదా అని వారంటారు. అప్పుడు సంబంధము అడిగే పనే లేదు. ఎందుకనగా ఫాదర్‌ అనగా తండ్రి అవ్వనే అయ్యారు కదా. ఆత్మలంతా శివవంశీయులే కావున అందరూ సోదరులే. అయితే సాకార ప్రజాపితతో ఏ సంబంధముంది? అందరూ తండ్రి కదా అని అంటారు. అతడిని ఆదిదేవుడని కూడా అంటారు. శివుడు నిరాకార తండ్రి. వారు అవినాశి. ఆత్మలు కూడా అవినాశే. పోతే ఆత్మలు సాకారములో ఒక శరీరాన్ని వదిలి మరో శరీరము తీసుకుంటాయి. ఆత్మలు నిరాకార శివవంశీయులు. ఆత్మలను కుమార - కుమారీలని అనము. ఆత్మలలో కుమార-కుమారీ అన్న భావముండదు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అయినప్పుడు అందులో కుమార-కుమారీలు ఉంటారు. శివవంశీయులైతే మొదటి నుండే ఉన్నారు. శివబాబా పునర్జన్మను తీసుకోరు. ఆత్మలైన మనము పునర్జన్మలలోకి వస్తాము. మంచిది. పుణ్యాత్మలుగా ఉన్న మీరే పాపాత్మలుగా ఎలా అయ్యారు? తండ్రి అంటున్నారు - భారతీయులైన మీకు మీరే చెంప దెబ్బలు వేసుకున్నారు. పరమపిత పరమాత్మ అని అంటారు. మరలా వారిని సర్వవ్యాపి అని కూడా అంటారు. పుణ్యాత్మలుగా తయారు చేసే తండ్రిని మీరు కుక్క, పిల్లి, రాయి, రప్పలు అన్నింటిలో పడేశారు. వారు అనంతమైన తండ్రి. మీరంతా వారినే స్మృతి చేస్తారు. వారే ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు. పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారినే మీరు అందరికంటే ఎక్కువగా అవమానపరిచారు. అందువలన మీ పై ధర్మరాజు వద్ద కేసు నడుస్తుంది. మీకు అందరి కంటే పెద్ద శత్రువు 5 వికారాల రూపీ రావణుడు. మీది రాముని బుద్ధి. మిగిలిన వారందరిదీ రావణ బుద్ధి. రామ రాజ్యములో మీరు ఎంతో సుఖంగా ఉండేవారు. రావణ రాజ్యములో మీరు చాలా దు:ఖితులుగా ఉన్నారు. అచ్చట ఉండేది పవిత్రమైన రాజ వంశము. ఇచ్చట పతిత రాజుల వంశముంది. ఇప్పుడు ఎవరి మతము పై నడవాలి ? పతిత పావనుడు ఒక్క నిరాకారుడే. ఈశ్వరుడు సర్వవ్యాపి. ఈశ్వరుడు నా ఎదుటనే ఉన్నాడు. ఈ విధంగా ప్రమాణము కూడా చేయిస్తారు. ఈ సమయములో తండ్రి మన ఎదుటే ఉన్నాడని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు కనులతో చూస్తున్నారు. పరమపిత పరమాత్మ ఈ శరీరములో వచ్చారని ఆత్మకు తెలుస్తుంది. మనము తెలుసుకొని గుర్తిస్తాము. శివబాబా మళ్లీ బ్రహ్మలో ప్రవేశమై మనకు వేద శాస్త్రాల సారము, సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యమును తెలిపి త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. స్వదర్శన చక్రధారులనే త్రికాలదర్శులని అంటారు. విష్ణువు ఈ చక్రమునిస్తారు. బ్రాహ్మణులైన మీరే మళ్లీ దేవతలుగా అవుతారు. దేవతల ఆత్మ, శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మీ శరీరమైతే వికారాలతో తయారయ్యింది కదా. చివరిలో మీ ఆత్మ భలే పవిత్రమౌతుంది కానీ శరీరము పతితముగా ఉంది కదా! కావున మీకు స్వదర్శన చక్రమివ్వలేరు. మీరు సంపూర్ణులైతే, విష్ణువు యొక్క విజయమాలగా అవుతారు. రుద్రమాల మరియు విష్ణుమాల. రుద్రమాల నిరాకార ఆత్మలది. వారు సాకారములో రాజ్యము చేయునప్పుడు విష్ణుమాలగా అవుతుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. పతిత పావనా! రండి, అని పాడ్తారు కూడా. అందువలన పతితపావనులు ఒక్కరే అయ్యారు కదా. సర్వ పతితులను పావనము చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందువలన వారు పతితపావనులు. అత్యంత ప్రియమైన శరీరము లేని గాడ్‌ఫాదర్‌. వారు పెద్ద తండ్రి. చిన్న బాబాను అందరూ బాబా - బాబా అని అంటూ ఉంటారు. దు:ఖము కలిగినప్పుడు పరమపిత పరమాత్మను గుర్తు చేసుకుంటారు. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. మొట్టమొదట పరమపిత పరమాత్మతో మీకు గల సంబంధమేదో అందరికీ అర్థం చేయించాలి. శివజయంతినేమో జరుపుకుంటారు. నిరాకార పరమపిత పరమాత్ముని మహిమ చాలా గొప్పది. ఎంత పెద్ద పరీక్ష ఉంటుందో అంత పెద్ద బిరుదు లభిస్తుంది కదా. బాబా అనే బిరుదు చాలా గొప్పది. దేవతల మహిమ సామాన్యమైనది. సర్వగుణ సంపన్నము, 16 కళా సంపూర్ణులు,.............. అన్నింటికంటే పెద్ద హింస కామఖడ్గమును ప్రయోగించి ఒకరికొకరు ఆదిమధ్యాంతములు దు:ఖమిచ్చుట. ఇది చాలా పెద్ద హింస. ఇప్పుడు మీరు డబుల్‌ అహింసకులుగా అవ్వాలి.

భగవానువాచ - ఓ పిల్లలారా! మీరంతా ఆత్మలు. నేను పరమాత్మను. మీరు 63 జన్మలు విషయ సాగరములో ఉండినారు. ఇప్పుడు నేను మిమ్ములను క్షీరసాగరములోకి తీసుకెళ్తాను. ఇక మిగిలి ఉన్న ఈ కొంత సమయము కొరకు మీరు పవిత్రముగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. ఇది మంచి మతము(సలహా) కదా! ముమ్ములను పావనంగా చేయండని కూడా అంటారు. పావనాత్మలు ముక్తిలో ఉంటాయి. సత్యయుగములో ఉండేది జీవన్ముక్తి. తండ్రి అంటున్నారు - సూర్యవంశీయులుగా అవ్వాలంటే పూర్తిగా పురుషార్థము చేయండి. నన్ను స్మృతి చేయండి. ఇతరులతో కూడా చేయించండి. ఎంతెంత స్వదర్శన చక్రధారులుగా తయారై, ఇతరులను తయారు చేస్తారో, అంత ఉన్నత పదవి పొందుతారు. ఈ ప్రేమ అనే పుత్రిక డెహరాడూన్‌లో ఉంటుంది. ఇంతమంది డెహరాడూన్‌ నివాసులు ఇంతకుముందు స్వదర్శన చక్రధారులుగా లేరు. అయితే ఎలా తయారయ్యారు? ఈ ప్రేమ అనే పుత్రిక తన సమానంగా తయారు చేసింది. ఈ విధంగా మీ సమానంగా తయారు చేస్తూ చేస్తూ దేవతా వృక్షము వృద్ధి చెందుతుంది. అంధులను నేత్రవంతులుగా తయారుచేయు పురుషార్థము చేయాలి కదా. 8 గంటలు మీకు శెలవు ఇచ్చాను. శరీర నిర్వహణార్థము వ్యాపారము మొదలైనవి చేసుకోండి. ఎచ్చటకు వెళ్లినా, ప్రయత్నము చేసి నన్ను స్మృతి చేయండి. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంత శాంతిని మొత్తం సృష్టికంతా దానము చేసినట్లవుతుంది. శాంతిని దానమిచ్చుట కష్టమైన పనేమీ కాదు. అయితే అప్పుడప్పుడు యోగములో కూర్చోబెడ్తారు. ఎందుకంటే సమూహ బలము జమ అవుతుందని బాబా అర్థం చేయించారు. శివబాబాను స్మృతి చేసి - బాబా, వీరు మన కులానికి చెందిన వారు. వీరి బుద్ధి తాళమును తెరవండి అని వారికి చెప్పండి. ఇది కూడా స్మృతి చేసేందుకు ఒక యుక్తి. నడుస్తూ-తిరుగుతూ శివబాబాను స్మృతి చేసే అభ్యాసము ఉంచుకోండి. బాబా వీరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించే దయా హృదయులు ఒక్క బాబాయే. ఓ భగవంతుడా! ఇతని పై దయ చూపండి అని భగవంతునితోనే చెప్తారు కదా. వారొక్కరే దయాసాగరులు, జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు. పవిత్రతలో కూడా ఫుల్‌(సంపూర్ణులు), ప్రేమలో కూడా ఫుల్‌(సంపూర్ణులు). కావున బ్రాహ్మణ కుల భూషణులకు కూడా పరస్పరములో చాలా ప్రేమ ఉండాలి. ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు. అక్కడ జంతువులు మొదలైనవి కూడా ఎవ్వరికీ దు:ఖమునివ్వవు. పిల్లలైన మీరు ఇంట్లో ఉంటూ చిన్న చిన్న విషయాలలో పరస్పరము సోదరులే కొట్లాడుకుంటారు. అక్కడ జంతువులు మొదలైనవి కూడా పోట్లాడవు. మీరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకుంటే తండ్రి అంటున్నారు - మీరు చాలా శిక్షలు అనుభవిస్తారు, పదవి భ్రష్టమైపోతుంది. మనమెందుకు శిక్షార్హులుగా తయారవ్వాలి? పాస్‌ విత్‌ ఆనర్‌(గౌరవపూర్వకముగా ఉత్తీర్ణులు)గా అవ్వాలి కదా. పోను పోను బాబా అన్ని విషయాలు సాక్షాత్కారము చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక చాలా కొద్ది సమయము మాత్రమే ఉంది. కావున త్వరపడండి. జబ్బు చేసినప్పుడు కూడా అందరికీ రామ రామ అనమని చెప్తారు కదా. లోపల నుండి కూడా చెప్తారు. చివరిలో కూడా కొంతమంది చాలా తీవ్రముగా వెళ్తారు. కొంతమంది శ్రమ చేసి ముందుకు వెళ్తారు. మీరు చాలా అద్భుతాలు చూస్తూ ఉంటారు. నాటకము చివరిలో అద్భుతమైన పాత్ర జరుగుతుంది కదా. చివరిలోనే అందరూ వాహ్‌! వాహ్‌!! అని అంటారు. ఆ సమయములో చాలా ఖుషీగా ఉంటారు. ఎవరిలో జ్ఞానము లేదో వారైతే అచ్చటే మూర్ఛపోతారు. ఆపరేషన్లు మొదలైనవి జరుగు సమయములో డాక్టర్లు బలహీనులను అచ్చట నిలువనివ్వరు. దేశ విభజన సమయములో ఏమి జరిగిందో అందరూ చూచారు కదా! ఇది చాలా బాధ కలిగించు సమయము. దీనిని అనవసర రక్తపాతము అని అంటారు. ఈ దృశ్యమును చూచేందుకు చాలా ధైర్యము కావాలి. మీది 84 జన్మల కథ. మీరే దేవీ దేవతలై రాజ్యపాలన చేసేవారు. తర్వాత మాయకు వశమై వామ మార్గములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ దేవతలుగా అవుతారు. ఇది స్మరణ చేస్తూ ఉన్నా మీ నావ తీరానికి చేరిపోతుంది. స్వదర్శన చక్రము ఇదే కదా. మంచిది.

 
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 
ధారణ కొరకు ముఖ్య సారము :- 
1. తండ్రి సమానంగా సర్వ గుణాలలో ఫుల్‌గా తయారవ్వాలి. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు. 
2. నడుస్తూ - తిరుగుతూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. స్మృతిలో ఉండి విశ్వమంతటికీ శాంతిని దానమివ్వాలి. 
వరదానము :- '
'' సంగమ యుగములో సదా ప్రత్యక్ష ఫలాన్ని లేక తాజా ఫలాన్ని భుజించే శక్తిశాలి మరియు తంద్‌రుస్త్‌ భవ '' 
ఒకటికి పదమారెట్లు ప్రాప్తియే కాక ప్రత్యక్ష ఫలము కూడా లభించే విశేషత సంగమ యుగానికి మాత్రమే ఉంది. సేవ చేసిన వెంటనే(అప్పటికప్పుడే) సంతోషమనే ఫలము లభిస్తుంది. ఎవరైతే ప్రత్యక్ష ఫలము అనగా తాజా ఫలమును భుజిస్తూ ఉంటారో, వారు శక్తిశాలిగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. వారి వద్దకు ఎలాంటి బలహీనత రాజాలదు. ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉండి కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతారో అప్పుడు బలహీనత వచ్చేస్తుంది. అలర్ట్‌(చురుకు)గా ఉంటే సర్వశక్తులు జతలో ఉంటాయి. అంతేకాక సదా ఆరోగ్యంగా ఉంటారు. 
స్లోగన్‌ :-
'' ఒక్క బ్రహ్మాబాబాను అనుసరించండి, మిగిలిన వారందరి నుండి గుణాలను గ్రహించండి. '' 

No comments:

Post a Comment