07-04-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము



''మధురమైన పిల్లలారా - ఒకరికొకరు సంతోషం అనే ఆహారాన్ని తినిపించుకుంటూ ఉండండి, సదా నవ్వు ముఖంతో ఉండి సంతోషాన్ని పంచడమే చాలా గొప్పగా అతిథి సత్కారం చేయడం.''

ప్రశ్న :-

ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునే విధి ఏది? ఏ ముఖ్యమైన విషయాల పై గమనముంచాలి?

జవాబు :-

ఉన్నతమైన స్థితిని తయారు చేసుకోవాలంటే -1. నిర్మోహులుగా అయ్యే ధైర్యం చేయాలి. 2. బాబాను స్మృతి చేసే సమయంలో వారితో ఏమేమి మాట్లాడాను? ఎంత సమయం స్మృతి చేశాను? అనే చార్టు ఉంచుకోవాలి. 3. నిద్రను జయించేవారిగా అవ్వాలి. 4. పాత శరీరాన్ని సంభాళించడమే కాక దీనిని మర్చిపోవాలి కూడా. 5. దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి, స్వభావానికి వశీభూతమై ఎవ్వరినీ సతాయించరాదు. 6. స్వయంలోని డిఫెక్ట్‌లన్నీ(లోపాలన్నీ) తొలగించి ప్యూర్‌ డైమండ్‌గా అవ్వాలి. 7. అందరికీ సంతోషమునిచ్చే సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి.

ఓంశాంతి.

జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము మారనున్నదని తెలుసు. మార్చేవారెవరో, ఎలా మారుస్తారో పాపం మనుష్యులకు తెలియదు, ఎందుకంటే వారికి జ్ఞాన మూడవ నేత్రమే లేదు. పిల్లలైన మీకు లభించిన జ్ఞాన మూడవ నేత్రముతో ఇప్పుడు మీరు సృష్టి ఆది-మధ్య-అంత్యాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞాన సాక్రిన్‌. ఒక్క సాక్రిన్ బిందువైనా ఎంత మధురంగా ఉంటుంది! ఈ జ్ఞానంలో కూడా ఒకే పదం ''మన్మనాభవ''. అన్నిటికంటే ఎంత మధురమైనది! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామానికి, సుఖధామానికి మార్గం తెలియజేస్తున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. సంతోషం వంటి పౌష్ఠిక ఆహారం లేదని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారో వారికి సంతోషం మంచి ఆహారం(టానిక్‌) వంటిది. ఇది 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు శక్తివంతమైన ఆహారము. ఈ ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. పరస్పరం ఈ గొప్ప అతిధి సత్కారం చేసుకోవాలి. ఇటువంటి అతిధి సత్కారం ఇక ఏ ఇతర మనిషి మనుష్యులకు చేయలేరు.

మీరు శ్రీమతమనుసారం అందరికీ ఆత్మిక అతిథి సత్కారం చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడమే సత్య-సత్యమైన కుశల యోగక్షేమాలు కోరడం. అనంతమైన తండ్రి ద్వారా మాకు జీవన్ముక్తి అనే పౌష్ఠిక ఆహారం లభిస్తోందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భారతదేశము జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. తండ్రి చాలా గొప్ప ఉన్నతమైన టానిక్‌ ఇస్తారు, అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని గాయనం ఉంది. ఇది జ్ఞాన-యోగాల ఎంత ఫస్ట్‌క్లాస్‌ వండర్‌ఫుల్‌ ఔషధము! ఈ ఔషధము ఒక్క ఆత్మిక సర్జన్‌ వద్ద మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికీ ఈ ఔషధము గురించి, ఆహారము గురించి తెలియనే తెలియదు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ! మీ కొరకు అరచేతిలో కానుక తీసుకొచ్చాను. ముక్తి-జీవన్ముక్తుల ఈ కానుక నా వద్ద మాత్రమే ఉంటుంది, కల్ప-కల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. మళ్ళీ మీ నుండి రావణుడు లాక్కుంటాడు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు సంతోష పాదరస మట్టము ఎంత పైకెక్కి ఉండాలి! మన తండ్రి, టీచరు, మనలను వెంట తీసుకెళ్ళే సద్గురువు అన్నీ ఒక్కరే అని మీకు తెలుసు. మోస్ట్‌ బిలవ్డ్‌(అత్యంత ప్రియమైన) తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా! సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్‌ లైఫ్‌ ఈజ్‌ ద బెస్ట్‌(ఈశ్వరీయ విద్యార్థి జీవితము సర్వోత్తమమైనది) అనే మహిమ ఇప్పటిదే కదా! మళ్ళీ నూతన ప్రపంచములో మీరు సదా సంతోషాల ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. సత్య సత్యమైన సంతోషాల ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలో ప్రపంచానికి తెలియదు. మనుష్యులకైతే సత్యయుగపు జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడ నుండి వస్తుంది! ఇక్కడైతే త్రాహి త్రాహి (అయ్యో - అయ్యో) అని అంటూ ఉంటారు. ఇది ఎంత దు:ఖ ప్రపంచము!

తండ్రి పిల్లలైన మీకు ఎంతో సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వృత్తి-వ్యాపారాదులు చేసుకుంటున్నా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణానికి ప్రేయసి, ప్రియుడు, వారు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసి, అతడు ఆమెకు ప్రియుడు. ఇక్కడ ఈ విషయం ఉండదు, ఇక్కడైతే మీరందరూ ఒక్క ప్రియునికి జన్మ- జన్మాంతరాలుగా ప్రేయసులై ఉంటారు. తండ్రి ఎప్పటికీ మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడు రావాలని గుర్తు చేసుకుంటూ వచ్చారు. దు:ఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. దు:ఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు అని గాయనం కూడా ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునిగా ఉన్నారు, రోజు రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమోప్రధానమవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మధురమైన పిల్లలూ దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయండి, మీరు ఇలా (లక్ష్మీ-నారాయణులుగా) తయారవుతారు. ఈ చదువులో ముఖ్యమైన సంగతి - 'స్మృతియే'. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని చాలా ప్రీతిగా, స్నేహంతో గుర్తు చేసుకోవాలి. నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేవారు ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే. తండ్రి చెప్తారు - నేను పిల్లలైన మిమ్ములను విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మల పాపాలు నశించిపోతాయి. పతిత పావనుడైన తండ్రి చెప్తారు, మీరు చాలా పతితంగా అయిపోయారు కాబట్టి ఇపుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా తయారై పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. పతిత-పావనుడైన తండ్రినే పిలుస్తారు కదా! ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దు:ఖహర్త-సుఖకర్త. తప్పకుండా సత్యయుగంలో పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. పిల్లలూ! శాంతిధామము సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి అని ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడిది సంగమ యుగము. నావికుడు మిమ్ములను ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు. పడవ ఏదో ఒక్కటే కాదు, ఈ మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద ఓడ వంటిది. దానిని ఆవలి తీరానికి తీసుకెళ్తారు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మీరు కూడా తండ్రి సేవలో లగ్నమైపోండి. ఆన్‌ గాడ్‌ ఫాదర్‌లీ సర్వీస్‌(ఈశ్వరీయ సేవలో). తండ్రియే మిమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసేందుకు వచ్చారు. మంచి పురుషార్థం చేసేవారిని మహావీరులని అంటారు. ఎవరైతే బాబా డైరెక్షన్‌ అనుసారం నడుస్తారో, వారిలో ఎవరు మహావీరులో చూస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర- సోదరులను(భాయీ - భాయీని) చూడండి అని బాబా ఆదేశము. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాన్ని చూడరు. నేను ఆత్మలను చూస్తానని తండ్రి చెప్తున్నారు. పోతే, ఆత్మ శరీరము లేకుండా మాట్లాడలేదు, ఇదైతే జ్ఞానము. నేను కూడా లోన్‌ తీసుకున్న ఇతని శరీరంలోకి వచ్చాను. శరీరంతోనే ఆత్మ చదవగల్గుతుంది. బాబా ఆసనము ఇక్కడుంది, ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాల మూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్న, పెద్ద అని ఉండదు, శరీరము చిన్నది, పెద్దది ఉంటుంది. ఆత్మలేవైతే ఉన్నాయో వాటన్నిటి ఆసనము ఈ భృకుటి మధ్యలో ఉంటుంది. శరీరాలైతే అందరివీ వేరు వేరుగా ఉంటాయి. కొందరిది పురుష అకాల సింహాసనము, కొందరిది స్త్రీ అకాల సింహాసనము, కొందరిది పిల్లల అకాల సింహాసనము. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్‌ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడే ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను ఫలానా సోదరునితో మాట్లాడ్తున్నాను. శివబాబాను స్మృతి చేయండి అంటూ తండ్రి సందేశాన్నిస్తారు. స్మృతితోనే మలినం తొలగాలి. బంగారంలో అలాయ్‌(ఇతర లోహము) కలుస్తూ ఉంటే బంగారం విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మలైన మీలో కూడా మలినం ఏర్పడడంతో మీరు వాల్యూలెస్‌గా(విలువ లేని వారిగా) అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది, ఆ నేత్రంతో మీ సోదరులను(ఆత్మలను) చూడండి. సోదర-సోదరులను(భాయీ - భాయీని) చూచినట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలం అవ్వవు. రాజ్య భాగ్యం తీసుకోవాలంటే, విశ్వానికి అధిపతులుగా అవ్వాలంటే ఈ శ్రమ చేయండి. సోదర-సోదరునిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి. అలా చేస్తే ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన బ్రదర్స్‌(సోదరులు). తండ్రి కూడా పై నుండి వచ్చారు, మీరు కూడా పై నుండే వచ్చారు. తండ్రి పిల్లల సహితంగా సేవ చేస్తున్నారు. సర్వీసు చేసేందుకు తండ్రి ధైర్యం ఇస్తారు. ధైర్యం పిల్లలది..... మరి ఈ ప్రాక్టీసు చెయ్యాలి. ఆత్మనైన నేను సోదరుని చదివిస్తాను, ఆత్మ చదువుతుంది కదా! ఆత్మిక తండ్రి నుండే లభించు ఈ జ్ఞానాన్ని స్పిరిచ్యుయల్‌ నాలెడ్జ్‌ అని అంటారు. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి తమను ఆత్మగా భావించండి అని ఈ జ్ఞానమునిస్తారు. మీరు అశరీరిగా(నంగే) వచ్చారు, మళ్ళీ ఇక్కడ శరీరం ధారణ చేసి మీరు 84 జన్మలు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ వాపస్‌ వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి భాయీ-భాయీ దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. మనం శ్రమ చేయాలి. ఇతరులతో మనకు పనేముంది? ఛారిటీ బిగిన్స్‌ ఎట్‌ హోమ్‌ అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి, తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు సూటిగా బాణం తగులుతుంది. ఈ పదును నింపుకోవాలి. శ్రమ చేసినప్పుడే ఉన్నత పదవి పొందుతారు. కొంచెం సహించవలసి వస్తుంది కూడా.


ఎవరైనా వ్యతిరేక మాటలు మాట్లాడితే, మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనం వహిస్తే రెండవ వ్యక్తి ఏం చేస్తాడు? చప్పట్లు రెండు చేతులతోనే మ్రోగుతాయి. ఒకరు మాట్లాడారు, రెండవ వ్యక్తి మౌనంగా ఉంటే అతడు తనంత తానే మౌనంగా అయిపోతాడు. మాటకు మాట పెరిగితే పోట్లాట అయిపోతుంది. పిల్లలు పరస్పరం కళ్యాణం(మంచి) చేసుకోవాలి. పిల్లలూ! సదా సంతోషంగా ఉండాలంటే ''మన్మనాభవ'' అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. సోదరుల(ఆత్మల) వైపు చూడండి. సోదరులకు కూడా ఈ జ్ఞానమునివ్వండి. ఈ అలవాటు చేసుకుంటే మళ్ళీ ఇంకెప్పుడూ క్రిమినల్‌ ఐ(చెడు దృష్టి) మోసగించదు. జ్ఞాన మూడవ నేత్రంతో, మూడవ నేత్రాన్ని(ఆత్మను) చూడండి. బాబా కూడా మీ ఆత్మలనే చూస్తారు. ఆత్మనే చూడాలి అని సదా ప్రయత్నం చేయాలి. శరీరాన్ని చూడనే వద్దు. యోగం చేయిస్తున్నప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులను(ఆత్మలను) చూస్తూ ఉంటే సర్వీస్‌ బాగా జరుగుతుంది. సోదరులకు అర్థం చేయించండి అని బాబా చెప్పారు. సోదరులందరూ తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానము బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అయ్యేవారు. ఈ సంగమ యుగాన్ని ఎంతమాత్రం వదలరు. వదిలితే ఎలా దాటి వెళ్లగలరు? ఎగిరి దూకరు కదా. ఇది అద్భుతమైన సంగమ యుగము. కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇదే మీకు లాభించే విషయము. తండ్రి ఇచ్చిన శిక్షణను సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానం ఇస్తున్నాను. నేను ఆత్మలనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో మాట్లాడాలంటే వారి ముఖాన్ని చూస్తారు కదా! మీరు ఆత్మలతో మాట్లాడాలంటే ఆత్మనే చూడాలి. భలే, శరీరం ద్వారా జ్ఞానం ఇస్తారు కాని ఇందులో దేహ భావాన్ని తెంచి వేయాల్సి ఉంటుంది. మా తండ్రి అయిన పరమాత్మ మాకు జ్ఞానం ఇస్తున్నారని మీ ఆత్మ భావిస్తుంది. తండ్రి కూడా చెప్తారు - నేను ఆత్మలను చూస్తాను. ఆత్మలు కూడా మేము పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాము, వారి నుండి జ్ఞానము తీసుకుంటున్నాము అని అంటాయి. దీనిని ఆత్మలు ఆత్మలతో స్పిరిచ్యుయల్‌ జ్ఞానం ఇచ్చి-పుచ్చుకోవడం అని అంటారు. జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది. ఆత్మకే జ్ఞానం ఇవ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానంలో ఈ పదును నిండుతుంది కనుక ఎవరికైనా అర్థం చేయిస్తే వెంటనే ఆ బాణం తగుల్తుంది. తండ్రి చెప్తారు, బాణం తగులుతుందో లేదో ప్రాక్టీస్‌ చేసి చూడండి. ఈ క్రొత్త అలవాటు చేసుకుంటే మళ్లీ శరీర భావము తొలగిపోతుంది. మాయ తుఫానులు తక్కువగా వస్తాయి, చెడు సంకల్పాలు రావు. క్రిమినల్‌ కన్ను(అపవిత్ర దృష్టి) కూడా ఉండదు. ఆత్మలైన మనము 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతితోనే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతాము. ఎంత సహజము! పిల్లలకు శిక్షణనివ్వడం కూడా నా పాత్రే అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది ఇందుకు నేను కట్టుబడి ఉన్నాను. పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తాను, మధురమైన పిల్లలూ! ఆత్మిక యాత్రలో ఉంటే అంతమతే సో గతి అయిపోతుంది. ఇది అంతకాలం కదా! నన్నొక్కరినే స్మృతి చేస్తే మీకు సద్గతి కలుగుతుంది. స్మృతియాత్రతో శరీరం దృఢంగా అవుతుంది. ఇది దేహీ-అభిమానిగా తయారయ్యే శిక్షణ. ఇది పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఎంత అద్భుతమైన జ్ఞానము! బాబా వండర్‌ఫుల్‌ కనుక ఇతరులెవ్వరూ చెప్పలేని బాబా జ్ఞానము కూడా అద్భుతమైనదే.

ఇది మీ బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన కులము. ఈ సమయంలోని మీ జీవితము అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని సంభాళించాలి. తమోప్రధానమైనందున శరీర ఆయువు కూడా తక్కువైపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఎంత యోగములో ఉంటే అంతగా ఆయువు పెరుగుతుంది. మీ ఆయువు పెరుగుతూ పెరుగుతూ సత్యయుగంలో 150 సంవత్సరాలైపోతుంది. కాబట్టి శరీరాన్ని కూడా సంభాళించాలి. అంతేకాని ఇదైతే మట్టితో చేసిన బొమ్మ ఎప్పటికైనా సమాప్తం అయిపోయేదే అని కాదు. జీవించి ఉండాలి. ఇది అమూల్యమైన జీవితం కదా! ఎవరైనా జబ్బు పడితే వారితో విసిగిపోకండి. వారికి కూడా శివబాబాను గుర్తు చేసుకోమని చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపం నశించిపోతుంది. వారికి సేవ చెయ్యాలి. జీవించి ఉండి శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి.

పిల్లలు నిర్మోహులుగా తయారయ్యేందుకు కూడా ధైర్యం కావాలి. వెంటనే ఒక్కసారిగా నిర్మోహులుగా అయిపోవాలి. అనంతమైన తండ్రి లభించారు కనుక వారి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. బాబాను స్మృతి చేసే సమయంలో బాబాతో ఏం మాట్లాడారు? బాబాను ఎంతగా మహిమ చేశారు? భోజనం చేయునప్పుడు ఎంత సమయం స్మృతి చేశారు, మళ్లీ మర్చిపోయారు. ఈ చార్టు పెట్టండి అని బాబా పిల్లలకు అర్థం చేయించారు, తమ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవడం చాలా అవసరం, నిద్రను జయించేవారిగా అవ్వాలి. స్మృతిని పెంచుతూ, ఇతరులకు నేర్పిస్తూ ఉండండి. ఇందులో తప్పకుండా నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. పాత శరీరాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. తండ్రికి చెందిన వారిగా అయ్యారంటే వారినే స్మృతి చెయ్యాల్సి ఉంటుంది. ఏ తండ్రి అయితే మనలను వజ్రం వలె తయారు చేస్తారో వారిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి! నాది దైవీ స్వభావంగా ఉందా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనుష్యులనకు స్వభావము చాలా సతాయిస్తుంది. ప్రతి ఒక్కరికి తమ మూడవ నేత్రము లభించింది కనుక దానితో పరిశీలించుకోవాలి. నా స్మృతి బాబా వరకు చేరుతోందా? లోపము ఏదైతే ఉందో దానిని తొలగించి ప్యూర్‌ డైమండ్‌గా తయారవ్వాలి. లోపము కొద్దిగా ఉన్నా విలువ తక్కువైపోతుంది, కాబట్టి శ్రమ చేసి తమను విలువైన వజ్రంగా తయారు చేసుకోవాలి. కర్మాతీత అవస్థ అయితే చివరిలో నంబరువారు పురుషార్థానుసారము వస్తుందని బాబాకు తెలుసు. అయినా మనతో పురుషార్థము చేయించేందుకు బాబా చెప్తారు కదా. నంబరువారు పురుషార్థం అనుసారమే బాబాకు కూడా ప్రియమైన వారిగా అనిపిస్తారు. ఎవరైతే ఇతరులకు సుఖం ఇచ్చే సుగంధ భరిత పుష్పాలుగా ఉంటారో, వారు దాగి ఉండలేరు. అయినా తండ్రి పిల్లలకు చెప్తారు - మధురమైన పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేస్తే మైల(మురికి) తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ హృదయం ఒక్కసారిగా గద్గదమైపోవాలి(శీతలమైపోవాలి). తండ్రి స్మృతి సతాయించాలి. బాబా, మధురమైన బాబా, మీరు మమ్ములను ఎలాంటి వారి నుండి ఎలాంటి వారిగా తయారు చేస్తున్నారు! మీరు మమ్ములను ఎలా తయారుచేస్తున్నారో ఇతరులెవ్వరికీ తెలియనే తెలియదు. కనుక ఇటువంటి మధురమైన బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. చాలామంది బంధనాల్లో ఉన్న మాతలు చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. ఎలా తమను విడిపించుకొని వస్తారో తెలియదు. వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ఇతర పిల్లలలో లేదు. ఒక్కసారిగా బాబాను స్మృతి చేస్తూ స్నేహములో కన్నీరు కారుస్తారు. బాబా మీతో ఎప్పుడు కలుస్తాను? విశ్వానికి అధిపతులుగా చేసే బాబా, ఓ బాబా! ఎప్పుడు మిమ్ములను సన్ముఖంలో కలుస్తాను. ఇలా చాలా ప్రేమతో బాబాను స్మృతి చేస్తారు. అందరి దు:ఖాలను తొలగించే బాబా, మా సౌభాగ్యాన్ని ఎంతగా తయారు చేశారు. మీరు మమ్ములను విశ్వానికి అధిపతులుగా చేస్తారు. స్మృతి చేసినందున వారికి చాలా బలము లభిస్తుంది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైనా వ్యతిరేక మాటలు మాట్లాడితే మౌనంగా ఉండాలి, వారితో వాదించరాదు(మాట్లాడరాదు), సహనం పాటించాలి. పరస్పరం కళ్యాణం(మంచి) చేసుకోవాలి.

2. జ్ఞాన మూడవ నేత్రంతో సోదర ఆత్మను ఆత్మ సోదరుని చూడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి జ్ఞానం చెప్పాలి. ఆత్మిక డ్రిల్‌ చెయ్యాలి, చేయించాలి. స్వయం పరిశ్రమ చేయాలి, ఇతరులను చూడకూడదు.

వరదానము :-

''ఇముడ్చుకునే శక్తి, సర్దుకునే శక్తి ద్వారా ఏకాగ్రతను అనుభవం చేసే సార స్వరూప భవ ''

దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల విస్తారం చాలా పెద్దది. అన్ని రకాల విస్తారాలను సార రూపంలోకి తెచ్చేందుకు ఇముడ్చుకునే శక్తి లేక సర్దుకునే శక్తి అవసరం. అన్ని ప్రకారాల విస్తారాలను ఒక్క బిందువులో ఇమిడ్చి వేయండి. నేనూ బిందువునే, నా తండ్రీ బిందునే. బిందువైన ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచమంతా ఇమిడి ఉంది. కనుక బిందు రూపము అనగా సార స్వరూపంగా అవ్వడం అనగా ఏకాగ్రమవ్వడం. ఏకాగ్రతా అభ్యాసము ద్వారా ఒక సెకండులో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు బుద్ధి అదే స్థితిలో స్థితమవ్వగలదు.

స్లోగన్‌ :-

''ఎవరైతే సదా ఆత్మిక స్థితిలో ఉంటారో, వారే ఆత్మిక గులాబీలు ''



No comments:

Post a Comment