''మధురమైన పిల్లలారా - మమ్మా - బాబాల సమానంగా సేవ (సర్వీసు) చేసేందుకు మీ బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకోండి, సతోప్రధాన బుద్ధి గలవారే ధారణ చేసి, ఇతరుల చేత ధారణ చేయించగలరు.''
ప్రశ్న :-
పిల్లలైన మీరు ఇప్పుడు చేస్తున్న సర్వోన్నతమైన పురుషార్థము ఏది?
జవాబు :-
మాతా - పితల సింహాసనాన్ని గెలుచుకోవడమే అన్నిటికన్నా ఉన్నతమైన పురుషార్థము. మమ్మా - బాబాలు వచ్చి మీకు వారసులుగా అవ్వాలి. ఇటువంటి నెంబర్వన్గా అయ్యే లక్ష్యాన్ని ఉంచుకోండి. దీని కొరకు మీరు ఉన్నతోన్నతమైన సేవ చేయాలి. చాలామందిని మీ సమానంగా తయారు చెయ్యాలి. దు:ఖితులై ఉన్న మనుష్యులను సుఖీలుగా తయారు చేయాలి. బుద్ధి అనే పాత్రలో అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులకు దానము చేయాలి.
పాట :-
భోలానాథునికి సాటి అయినవారు ఇంకెవ్వరూ లేరు..........(భోలేనాథ్ సే నిరాలా...........)
ఓంశాంతి.
'తండ్రి లేదా మాత - పితలు మాకు నేర్పిస్తున్నారు' అనే విషయాన్ని పిల్లలు ఇప్పుడు గ్రహించారు. ఇప్పుడు 'మేము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము'
అనే సంతోషము కూడా పిల్లలలో ఉండాలి. పిల్లలే ఈ విధమైన ప్రతిజ్ఞను కూడా చేస్తారు - బాబా! మేము ఇప్పుడు మీకు చెందిన వారిమే. ఇప్పుడు మేము అసురుల సంబంధములో లేము. మేము ఈశ్వరునికి చెందినవారము. మేము ఇప్పుడు ఆసురీ మతమును అనుసరించము. ఆసురీ మతము అని దేనినంటారు? శ్రీమతమును అనుసరించక ఆసురీ కర్మలు చేసేవారిని ఆసురీమతమువారని అంటారు. ఒకటేమో ఈశ్వరీయ కర్మ, రెండవది ఆసురీ కర్మ. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? ఎప్పుడు స్థాపన చేశారు? అనే అంశాలను గురించి ఎవ్వరికీ తెలియదు. ఇతర ధర్మాల వారందరికీ వారి వారి ధర్మాలను గురించి తెలుసు. సన్యాసులు వారి ధర్మాన్ని శంకరాచార్యులు స్థాపన చేశాడని అంటారు. దేవీదేవతా ధర్మము ఇప్పుడు లేనే లేదు. మరి దానిని గురించి ఎవరు చెప్తారు? లక్ష్మీనారాయణులు మొదలైనవారిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రిని గురించే తెలియదు. కనుక విముఖత చెంది ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నది. అనంతమైన తండ్రి వచ్చి పిల్లలైన మనకు సత్యయుగము కొరకు మళ్లీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకిప్పుడు తెలుసు. మీరు వైకుంఠానికి యజమానులుగా అవ్వాలి. కృష్ణపురములోకి వెళ్లాలి. ఇది కంసపురి, కంసుడు మరియు కృష్ణుడు ఇరువురూ కలిసి ఉండలేరు.
పరమపిత పరమాత్మ మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారనే నషా పిల్లలైన మీకిప్పుడు ఉండాలి. నేను పరంధామము నుండి పురాతనమైన ఈ రావణ ప్రపంచములో, పాత శరీరములో వచ్చానని తండ్రి చెప్తున్నారు. ఉదాహరణానికి మనుష్యులు పితృదేవతలకు తినిపించునపుడు,
ఆ ఆత్మ పాత శరీరములోకి (ఇతరుల శరీరాలలోనికి) వస్తుంది. అప్పుడు ఆ ఆత్మకు ఇది పాత ప్రపంచము అని అనరు. పాత శరీరములోకి వస్తుంది. అప్పుడు వారికి తినిపిస్తారు, త్రాగింప జేస్తారు. ఈ విధమైన పద్ధతి భారతదేశములో నడుస్తూ వస్తున్నది. ఇది భావన. నా పతి ఆత్మ ఈ బ్రాహ్మణుడిలో వచ్చిందని అంటారు. వారు ఆ విధమైన భావన ఉంచుతారు. పతి నామరూపాలను జ్ఞాపకము చేసుకుంటారు. ఆత్మయే వచ్చి అక్కడ స్వీకరిస్తుందని భావిస్తారు. ఇది ఇక్కడి ఆచారము. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. వ్యర్థముగా ఖర్చు చేయడం, మోసపోవడం............ మొదలైనవి భక్తిమార్గములోని పద్ధతులు. భావన ఉంచుకోవడం వలన వారికి లభించే అల్పకాల సుఖము కూడా తండ్రి ద్వారానే లభిస్తుంది. తండ్రి ఎప్పుడూ దు:ఖమును ఇవ్వరు. ఈ విషయం తెలియనందున పరమాత్మయే సుఖ-దు:ఖాలనిస్తారని మనుష్యులు భావిస్తారు. ఇది తయారైన డ్రామా(ఆట). ఎవరైతే దేవీదేవతా ధర్మము వారుంటారో వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. అప్పుడు మీకు వారు మీ కులానికి(దేవీ దేవతాధర్మమునకు) చెందినవారని, వారు ఎక్కువ భక్తి చేశారని అర్థమౌతుంది. ఎవరైనా బాగా చదువుకున్నారనుకోండి, వారికి పదవి కూడా మంచిది లభిస్తుంది. ఆ విధంగా, ఎవరు ఎక్కువ భక్తి చేశారో, వారి భక్తికి ఫలమును ఇచ్చేందుకు నేను వచ్చానని తండ్రి అంటున్నారు. భక్తిలో అయితే దు:ఖము ఉంది కదా ! ఎంతగా తిరగవలసి ఉంటుంది ! ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే నేను మిమ్ములను అన్ని రకాల దు:ఖాల నుండి దూరము చేస్తాను. తండ్రి ఎప్పుడూ తప్పుడు మతమును ఇవ్వరు. సన్ముఖములోకి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరి బుద్ధిలోనైనా కూర్చుని మతాన్ని ఇచ్చే రావణుడు అనబడే వారెవరూ లేరు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. మాయ కారణంగానే మనుష్యులు పూర్తిగా పతితమైపోతారు. మీరు దేవతలుగా అవుతారని మళ్లీ అర్ధకల్పము తర్వాత పతితముగా అవ్వడం ప్రారంభమౌతుందని మీకు తెలుసు. ఈ బాబా కూడా అనుభవజ్ఞుడైన వృద్ధుడు కదా! సాధువులను సన్యాసులను, సత్పురుషులను........... మొదలైన వారందరినీ చూశారు. శాస్త్రాలు కూడా చదివారు. తండ్రి తప్పకుండా అనుభవీ రథములోనే వస్తూ ఉండవచ్చు. భగవంతుడు ఈ ఒకే రథములోనే ఎందుకు వస్తారు? - అదే విధంగా ఆ రథానికి కూడా ఏదైనా చరిత్ర తప్పకుండా ఉండి ఉంటుంది కదా! భగీరథుడు అనగా ''భాగ్యశాలీ రథము''. భగీరథుని ద్వారా గంగ వచ్చిందని అంటారు. ఇప్పుడు నీటి గంగ అయితే వెలువడజాలదు. ఇంతకు ముందు మనకు కూడా అర్థమయ్యేది కాదు. భాగ్యశాలీ రథము అంటే ఈ బ్రహ్మ కదా. వీరిలోనే పరమపిత పరమాత్మ వస్తారు. 'ఈ బ్రహ్మలో భగవంతుడెలా వస్తాడు?' అని మనుష్యులు సంశయపడ్తారు. మీరు ఈ మనిషిని 'బ్రహ్మ' అని చెప్తున్నారా? బ్రహ్మ అంటే భగవంతుడు కదా. సూక్ష్మవతనములో ఉంటాడు. మరి మీరు మనిషిని బ్రహ్మగా చెప్తున్నారే!............ అని అంటారు. ఇదంతా వీరి కల్పన అని కూడా అంటారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు ఇక్కడకు ఎలా వస్తారు? అరే! ప్రజాపిత బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు జన్మించారు అని అన్నప్పుడు వారు ఇక్కడే ఉంటారు కదా! జరిగిపోయినదంతా మళ్లీ అలాగే పునరావృతమౌతుంది. ముస్లింలు ఏ విధంగా వచ్చారు?.......... చరిత్రలో ఏమేమి జరిగాయో అవన్నీ మళ్లీ జరుగుతాయి. డ్రామా రహస్యము గురించి మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. వారు(శాస్త్రవాదులు) డ్రామా ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ప్రళయం జరుగుతుందని కూడా చెప్తారు. ఒకవేళ ఇప్పుడు కృష్ణుడు వచ్చినా సత్యయుగములోనే వస్తారు కదా! మరి అతడిని ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకెళ్ళారు? ప్రళయమైతే ఎప్పటికీ జరగదు. పతితపావనా రండి! అని పాట కూడా పాడ్తారు. మరి తప్పకుండా పతిత ప్రపంచములోనే వచ్చి పతితులను పావనంగా చేస్తారు కదా. పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను ఒక్కసారి మాత్రమే ఈ సృష్టిలో వస్తానని తండ్రి చెప్తారు. జ్ఞానసాగరుడైన నేనే సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను అర్థం చేయించగలను. పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా ఎలా తయారు చేస్తానో పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తాను. అక్కడ హద్దులోని ఇంటి విషయం, ఇది అనంతమైన ఇల్లు. తండ్రికైతే ప్రేమ ఉంటుంది కదా! అందుకే భక్తిమార్గములో కూడా ఇంతగా సహాయం చేస్తారు. మనుష్యులు ఇలా చేయలేరు. ఈశ్వరుడు సుఖమయమైన జన్మనిచ్చాడు అని అంటారు. ఎవరి వద్ద ధనము ఎక్కువగా ఉంటుందో వారు ఇదంతా ఈశ్వరుడు ఇచ్చారని అంటారు. మరి వారు మళ్లీ తీసేసుకుంటే ఎందుకు దు:ఖపడాలి? తండ్రినైన నా ఒక్కరి మాటను మాత్రమే వినండి. ఇంకెవ్వరి మాటలు వినకండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి,
టీచరు,
సద్గురువు - ముగ్గురి రూపములోనూ పాత్రను అభినయించి చూపిస్తారు. సద్గతిదాత ఒక్కరే. అంధుల చేతికర్ర ఒక్క ప్రభువే,........ పతితులను పావనంగా తయారు చేసే ప్రభువు అయిన తండ్రి ఒక్కరే,..... నేను సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తానని అంటున్నారు.
ఇప్పుడు మీరంతా బ్రహ్మకుమారీ-కుమారులు. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గముగా అయిపోయింది. దీనిని ''వికారీ ప్రవృత్తి మార్గము'' అని అంటారు. మనుష్యులు చెప్పడానికి వీలు లేనంతగా మహా దు:ఖితులుగా ఉన్నారు. ''త్రాహీ - త్రాహీ'' అని అంటూ ఉంటారు. రోధిస్తూ, బాదుకుంటూ ఉంటారు. ధర్మాలు అనేకమున్నాయి. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. దానిని ఒక్క తండ్రియే స్థాపన చేస్తారు. గీతలో కృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు. ఈ ఒక్క పొరపాటును చేశారు. పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారి పేరు 'శివ'. ఆత్మకు 'ఆత్మ' అన్న పేరు ఒక్కటే ఉంటుంది. ఇంకొక పేరు ఉండదు. శరీరము పేర్లు పరివర్తనౌతాయి. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటే పేరు మారిపోతుంది. తండ్రి పేరు ఒక్క శివబాబాయే. వారికి శారీరికమైన పేరు లభించదు. ఆత్మ 84 జన్మలను ధరిస్తుంది. ఆత్మకు శారీరిక పేర్లు ఉంటాయి. నాకైతే ఒక్కటే పేరు ఉంది అని శివబాబా చెప్తున్నారు. భలే నేను ఇతడిలో ప్రవేశించినా, ఈ శరీరానికి యజమాని ఈ దాదా ఆత్మయే. అతడిలో నేను ప్రవేశించి ప్రజలను రచిస్తున్నాను. మరి ప్రజాపిత తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా. మనుష్యులకు ఈ విషయాలను గురించి తెలియదు. అందరూ చదివే కాలేజి ఇది ఒక్కటే. మురళి అన్ని వైపులకు వెళ్తుంది. కొందరి బుద్ధి సతోప్రధానంగా ఉంది. కొందరిది సతోగానూ, కొందరిది రజోగా, కొందరిది తమోగా ఉంటుంది. ఏ మాత్రము ధారణ జరగదు. కావున వారి కర్మలు అలానే ఉన్నాయి. అందులో బాబా ఏం చేస్తారు? అందరూ ఒకే విధంగా ఉండజాలరు. ఇది ఈశ్వరీయ కాలేజి, చదివించే ఈశ్వరుడు ఒక్కరే. ఎవరినైతే చదివిస్తారో వారు ధారణ చేసి మళ్ళీ చదివించేందుకు టీచరుగా అవుతారు. నా బుద్ధి సతోప్రధాన బుద్ధిగా ఉందా? మమ్మా-బాబాల వలె అర్థం చేయించగలుగుతున్నానా? అని ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. బాబా వద్దకు అన్ని సెంటర్ల నుండి సమాచారము రావాలి. ఎంతమంది విద్యార్థులు రెగ్యులర్గా వస్తున్నారు? ఎప్పటి నుండి పవిత్రంగా ఉంటున్నారు? ఇలా బాబాకు మొత్తం లెక్కాచారమంతా తెలియాలి. మాతా-పితలు పెద్దవారు కదా! మాత అయిన జగదంబ కూడా కూతురే అవుతుంది. ఈ బాబా ఈ ప్రపంచ అనుభవము కూడా గలవారు. డ్రామాలో ముఖ్యమైన నటులనే చూడటం జరుగుతుంది కదా! బాబా కూడా ఈ రథమును తీసుకున్నారంటే తప్పకుండా ఏదో కారణము ఉంటుంది కదా! ఆది దేవుడైన బ్రహ్మకు ఎంతో పేరు ఉంది. ఆదిదేవుడని ఎవరిని అంటారో మనుష్యులు అర్థం చేసుకోరు. నిజానికి ఆదిదేవుడు మరియు ఆదిదేవిగా మాత-పితలైన వీరే అవుతారు. వీరి నోటి ద్వారా సరస్వతి వస్తుంది. కనుక అందరూ పిల్లలే అవుతారు. '' నేను శివబాబాకు కొడుకునూ అవుతాను, వారికి పత్నిని కూడా అవుతాను. ఎందుకంటే, వారు నాలో ప్రవేశించి నా నోటి నుండి పిల్లలకు జన్మనిస్తారు'' - అని ఇతడు(బ్రహ్మబాబా) అంటాడు. ఇది ఎంత రహస్యయుక్తమైన విషయము! సతోప్రధాన బుద్ధి గలవారు దీనిని బాగా అర్థం చేసుకుంటారు. పిల్లలు నెంబరువారుగా ఉంటారు. రాయల్ కుటుంబము వారికి మరియు ప్రజలకు తేడా అయితే ఉంటుంది కదా! ప్రజలుగా కూడా తమ పురుషార్థము ద్వారానే తయారౌతారు. అలాగే రాజులు కూడా పురుషార్థము ద్వారానే తయారౌతారు. మీరు బాగా చదివితే ఉన్నత పదవిని పొందుతారు అని బాబా అంటారు. ఎవరైతే వారసులుగా అవుతారో, వారు రాయల్ కుటుంబములోకి వస్తారు. పూర్తిగా పురుషార్థము చేయండి. రాజ్యమునిచ్చేందుకే నేను వచ్చానని బాబా చెప్తున్నారు. మాత-పితల నుండి మేము స్వర్గ రాజ్యాధికారమును, వారసత్వాన్ని తీసుకొనే తీరుతాము అని పురుషార్థము చేయాలి లేకపోతే క్షత్రియులుగా అవుతారు. విద్యార్థులు స్వయం అర్థం కూడా చేసుకోగలరు. ఆ స్కూళ్ళలో ఫెయిల్ అయితే మళ్లీ చదవవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మళ్లీ చదవలేరు. ఒకసారి ఫెయిలైతే ఇక ఎప్పటికీ ఫెయిల్గానే ఉంటారు. కావున పురుషార్థము పూర్తిగా చేయాలి. అనేక మందిని తమ సమానంగా తయారు చేయడమే ఉన్నతోన్నతమైన సేవ. దు:ఖితులైన మానవులను సదా సుఖవంతులుగా తయారు చేయాలి. ఇదే మన వ్యాపారము. '' సింధ్లో ఎంతో మంది ఇల్లు - వాకిళ్ళను వదిలి వచ్చేశారు. కావున మేము కూడా అలా వదలవలసి ఉంటుందేమోనని భావించకండి ''
అని బాబా సదా చెప్తూ ఉంటారు. అది డ్రామాలో రచింపబడింది. అంతేకాని అలా ఎత్తుకుపోయే విషయమేమీ లేదు. భగవంతుడు తప్పు పని ఎప్పుడూ చెయ్యరు. అవన్నీ అసత్యమైన కళంకాలు.
మొదటి నెంబర్లో ఈ మమ్మా-బాబాలు పదవిని పొందుతారని పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా మళ్లీ మమ్మా-బాబాల సింహాసనము పై విజయాన్ని పొందుతారు. ఎవరైతే మొదటి నెంబరులో ఉంటారో, వారు మళ్లీ క్రిందికి దిగుతూ పోతారు. పిల్లలు పెద్దవారై సింహాసనము పై కూర్చుంటే మామ్మా-బాబాలు రెండో నెంబర్లోకి వెళ్లిపోతారు. అప్పుడు మొదటి రాజా-రాణులు చిన్నవారైపోతారు. కావున పురుషార్థము చేసి మమ్మా-బాబాల సింహాసనము పై విజయాన్ని పొందాలి. అంతేకానీ ఇప్పుడు విజయము పొందడం కాదు. భవిష్య సింహాసనము పై విజయాన్ని పొందాలి. మమ్మా-బాబాలు వచ్చి మీ వారసులుగా అవ్వాలి. బాబా పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు! ఈ జ్ఞానము పాదరసము వంటిది. అది క్షణములో ఎగిరిపోతుంది. కొందరి వద్ద ఏ మాత్రము ధారణ లేదు. ఇది ఆశ్చర్యము కదా!
ఇక్కడ నిరాకారుడైన భగవంతుడే చదివిస్తున్నారు, కృష్ణుడు కాదని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. 'భగవానువాచ' అని ఉంది కదా! భగవంతునికి మీరు శరీరాన్ని ఇవ్వలేరు. శివ భగవానువాచ కృష్ణుని శరీరము ద్వారా అని కూడా వ్రాయబడలేదు. ఇది భగవానువాచ. మొట్టమొదట బాబా కూర్చుని మనలను చదివిస్తున్నారని మీ హృదయములోకి రావాలి. తండ్రి అన్న పదము రావడంతోనే వారసత్వము గుర్తు రావాలి. ఎంతగా మనము చదువుతామో అంతగా స్వర్గములో ఉన్నత పదవిని పొందుతాము. ఎంతగా బాబాను స్మృతి చేస్తామో అంతగా వికర్మల భారము అంతమైపోతుంది. స్మృతి చేయడం ద్వారా బుద్ధి బంగారు పాత్రగా అయిపోతుంది. దానం చేస్తూ ఉంటే ధారణ జరుగుతూ ఉంటుంది. ధనము ఇచ్చినా ధనము తరగదు,........... (ధన్ దియే ధన్ నా కూటే,....) అని గాయనం ఉంది కదా. ఇలా తండ్రి మీ పై రాజీ అవుతారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేస్తారు. జనులు ఏ శాస్త్రాలనైతే వింటారో వాటినే జ్ఞానముగా భావిస్తారు. వాటినే లక్షల ఆస్తిగా భావిస్తారు. కానీ అవి గవ్వల వంటివి. కావున పిల్లలూ! మీ హృదయములోనికి మా బాబా, 'టీచరు మరియు గురువు కూడా' అని గుర్తుకు రావాలి. వారు తమతో పాటు తీసుకెళ్తారు కూడా. ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకెళ్తారు. ఇది జ్ఞానామృతము. పిల్లలు స్కూల్లో చదివేటప్పుడు బ్రహ్మచారులుగా ఉంటారు,
వారు అశుద్ధంగా అయిపోతే చదువు చల్లబడిపోతుంది. బుద్ధి పూర్తిగా మలినమైపోతుంది. ఇది ఆత్మిక విద్య. బ్రహ్మచర్యము లేకుండా ధారణ జరుగదు. ఇప్పుడు మీరు చదువుకోండి లేకపోతే కల్ప-కల్పము స్వర్గాధిపతులుగా అవ్వలేరు. మీ పురుషార్థము ద్వారానే అలా తయారవుతారు. బాబా ఆశీర్వదించినట్లయితే అందరూ రాజులుగా అయిపోతారు. కానీ ఇది చదువు. బాగా చదువుకుంటే, వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు, బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే పాడైపోతారు(పఢేంగే,
లిఖేంగే తో బనేంగే నవాబ్, బుద్ధి కో భటకాయేంగే తో హోంగే ఖరాబ్) - అని బాబా చెప్తారు. ఇది చాలా పెద్ద కాలేజి. దీని పేరే బ్రహ్మకుమారీ-కుమారుల ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇది ఈశ్వరునిచే స్థాపించబడింది. ఈశ్వరుడినే 'తండ్రి' అని అంటారు. కావున బాబాయే తండ్రి-టీచరు-గురువు. ఇది మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. సద్గురువు రూపములో వీరు అందరినీ తిరిగి తీసుకెళ్తారు. అక్కడ ఒక గురువు మరణిస్తే ఇంకొక అనుచరుడిని ఆ గద్దె పై కూర్చోబెడ్తారు. ఇది వ్యభిచారిగా అవ్వడం. నేను మళ్లీ అందరినీ తీసుకెళ్తానని బాబా గ్యారెంటీ ఇస్తున్నారు. ఎక్కడికి? దేని కొరకైతే మీరు అర్ధకల్పము నుండి భక్తి చేస్తూ వచ్చారో అక్కడికి, ముక్తిధామములోకి తీసుకువెళ్తాను. ఆ తర్వాత ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారు వైకుంఠానికి అధిపతులుగా అవుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
చదువును ధారణ చేసి ఇతరులను చదివించేందుకు అర్హులుగా అవ్వాలి. మమ్మా-బాబాల సమానంగా సేవ చేయాలి.
2.
అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేసి దు:ఖితులుగా ఉన్న మానవులను సుఖవంతులుగా చేయాలి. ఈ చదువును బాగా చదవాలి.
వరదానము :-
''శబ్ధానికి అతీతంగా శ్రేష్ఠమైన స్థితిలో స్థితమై ఉండి శాంతి శక్తిని అనుభవం చేసే మాస్టర్ బీజరూప భవ ''
శబ్ధానికి అతీతంగా ఉండే శ్రేష్ఠ స్థితి సర్వ వ్యక్త ఆకర్షణలకు అతీతంగా(భిన్నంగా), ప్రియంగా ఉండే శక్తిశాలి స్థితి. ఈ శ్రేష్ఠ స్థితిలో ఒక సెకండు స్థితమై ఉండినా దాని ప్రభావము పూర్తి రోజంతా మీరు కర్మలు చేస్తున్నా స్వయంలో విశేషమైన శాంతి శక్తిని అనుభవం చేస్తారు. ఈ స్థితినే కర్మాతీత స్థితి, బాప్ సమాన్ సంపూర్ణ స్థితి అని అంటారు. ఇదే మాస్టర్ బీజరూప స్థితి, మాస్టర్ సర్వశక్తివంతుల స్థితి. ఈ స్థితి ద్వారా ప్రతి కార్యములో సఫలత అనుభవమవుతుంది.
స్లోగన్ :-
''ఎవరి ప్రతి మాట మహావాక్యంగా ఉంటుందో,
వారే మహాన్ ఆత్మలు ''
No comments:
Post a Comment