07-04-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 27-03-1982 మధువనము
ధ్వనికి(శబ్ధనికి) అతీతంగా ఉండే తండ్రి ఈ
ధ్వని ప్రపంచంలోని ధ్వని ద్వారా అందరినీ ధ్వనికి అతీతంగా తీసుకెళ్తారు. వెంట
తీసుకెళ్లేందుకే బాప్‌దాదా రావడం జరుగుతుంది. అందరూ వెంట వెళ్లేందుకు ఎవరెడీగా
ఉన్నారా?
లేక
తయారయ్యేందుకు ఇంకా సమయం కావాలా? వెంట వెళ్లేందుకు బిందువుగా అవ్వాల్సి ఉంటుంది. బిందువుగా అవ్వడానికి వ్యాపించి ఉన్న అనేక రకాల విస్తారాన్ని అనగా అనేక శాఖలు కలిగిన వృక్షాన్ని బీజములో ఇముడ్చి బీజరూప స్థితి అనగా బిందువులోనే అన్నింటిని ఇమిడ్చాల్సి ఉంటుంది. లౌకిక పద్ధతిలో కూడా చాలా విస్తారంగా లెక్కలు కట్టేటప్పుడు మొత్తం లెక్కనంతా సమాప్తి చేసి చివరిలో ఏం చేస్తారు? శివా అని అంటారు. శివ అనగా బిందువు. అదే విధంగా సృష్టి చక్రము లేక కల్పవృక్షములో ఆది నుండి అంత్యము వరకు ఎన్నో లెక్కా ఖాతాల(కర్మ ఖాతాల) విస్తారంలోకి వచ్చారు. తమ లెక్కల ఖాతాల శాఖలు లేక విస్తారము అనే వృక్షం గురించి తెలుసు కదా? దేహం యొక్క లెక్కల శాఖలు, దేహ సంబంధాల శాఖలు, దేహం యొక్క విభిన్న పదార్థాలలో బంధన ఆత్మగా అయ్యే శాఖలు, భక్తిమార్గము మరియు గురువుల బంధనాలతో కూడిన శాఖలు, రకరకాల వికర్మల బంధనాల శాఖలు, కర్మ భోగం యొక్క శాఖలు,......... ఎంతో విస్తారం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మొత్తం విస్తారాన్ని బిందు రూపముగా అయ్యి బిందువు పెడ్తూ ఉన్నారా? మొత్తం విస్తారాన్ని బీజములో ఇముడ్చేశారా? లేక ఇప్పుడు కూడా ఇంకా విస్తారము ఉందా? ఈ శిదిలావస్థలోని వృక్షము యొక్క ఏ శాఖ మిగిలి లేదు కదా! సంగమ యుగమే పాత వృక్షము సమాప్తమయ్యే యుగము. కావున ఓ సంగమయుగీ బ్రాహ్మణులారా! పాత వృక్షాన్ని సమాప్తి చేశారా? వృక్షములో ఆకు ఆకుకీ నీళ్ళు ఇవ్వలేము. కానీ బీజానికి ఇస్తే ఆకులన్నిటికీ నీళ్ళు లభిస్తాయి. ఈ విధంగా 84 జన్మలలోని రకరకాల లెక్కాఖాతాల సమాప్తి చేయాలి. ఒక్కొక్క శాఖను సమాప్తి చేయడం కాదు. ఈ రోజు దేహ స్మృతి అనే శాఖను సమాప్తి చేయడం, రేపు దేహ సంబంధాల శాఖను సమాప్తి చేయడం,........ ఇలా ఒక్కొక్క శాఖను సమాప్తి చేసినందున సమాప్తి జరగదు కానీ బీజమైన తండ్రితో లగ్నాన్ని జోడించినందున అనే అగ్ని ద్వారా సహజంగానే సమాప్తి అయిపోతుంది. కట్ చేయడం వలన కాదు కానీ భస్మం చేయాలి. ఎందుకనగా ఈ రోజు కట్ చేస్తారు, కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రకటితమైపోతాయి. ఎందుకంటే వాయుమండలం ద్వారా వృక్షానికి సహజంగానే నీరు లభిస్తూ ఉంటుంది. వృక్షం పెద్దదిగా అయినప్పుడు విశేషించి నీరు ఇవ్వవలసిన అవసరం ఉండదు. సహజమైన వాయుమండలం ద్వారా వృక్షం పెరుగుతూనే ఉంటుంది లేక నిలబడి ఉంటుంది. అలాగే విస్తారాన్ని పొందిన ఈ శిధిలావస్థకు వచ్చిన వృక్షానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. పురుషార్థం ద్వారా ఈ రోజు నుండి దేహ సంబంధాలు అనే స్మృతి రూపి శాఖలను సమాప్తి చేశాము అని అనుకుంటారు కానీ భస్మం చేయకుంటే మళ్లీ శాఖలు వచ్చేస్తాయి. తర్వాత మేము ఇది సమాప్తి చేసేశాము మరలా ఎలా వచ్చింది అని స్వయానికి స్వయములో అనుకుంటాము లేక తండ్రి ముందు కూడా చెప్తారు. మొదట అయితే లేనే లేదు మళ్లీ ఎలా వచ్చింది, కారణమేది? కట్ చేశారు కాని భస్మం చేయలేదు. అగ్నిలో పడిన బీజము ఎప్పుడూ ఫలాన్ని ఇవ్వదు. కావున ఈ లెక్కాచారాల విస్తారము అనే వృక్షాన్ని లగ్నమనే అగ్నిలో సమాప్తి చెయ్యండి. తర్వాత ఏముంటుంది? దేహము మరియు దేహ సంబంధాలు లేక దేహ పదార్థాల విస్తారము సమాప్తమైపోతే బిందువు అయిన ఆత్మ బీజము అయిన ఆత్మ మిగులుతాయి. ఇలాంటి బిందువుగా, బీజ స్వరూపంగా అయిపోతే అప్పుడు ధ్వనికి(శబ్ధానికి) అతీతంగా బీజరూపుడైన తండ్రి జతలో వెళ్ళగలరు. అందువలన ధ్వనికి అతీతంగా అయ్యి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అని అడగడం జరిగింది. విస్తారాన్ని సమాప్తి చేసేశారా? బీజరూపుడైన తండ్రి బీజ స్వరూపంగా అయిన ఆత్మలనే తీసుకెళ్తారు. బీజ స్వరూపంగా అయ్యారా? ఎవరెడీగా ఉన్నవారికి ఇప్పటి నుండే అలౌకిక అనుభూతులు జరుగుతూ ఉంటాయి. ఏ అనుభూతులు జరుగుతాయి?

నడుస్తూ, తిరుగుతూ, కూర్చుంటూ, మాట్లాడుతూ, మాట్లాడుతూ అయ్యే మొదటి అనుభూతి - ఈ శరీర లెక్కా ఖాతాల వృక్షానికి ముఖ్యమైనది
- కాండము, దీనితోనే ఈ శాఖలన్నీ వెలువడుతూ ఉంటాయి. ఈ
దేహము మరియు ఆత్మ అనే బీజము రెండూ పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఈ విధంగా ఆత్మ నడుస్తూ
తిరుగుతూ తన అతీత స్థితిని మాటిమాటికి అనుభవం చేస్తుంది. జ్ఞాన లెక్కతో ఆత్మ మరియు
శరీరము రెండూ వేరుగా ఉన్నాయి అని కాకుండా శరీరం నుండి వేరుగా నేను ఆత్మను అని, వేరుగా ఉన్న వస్తువు అని అనుభవం అవ్వాలి. ఎలాగైతే స్థూల శరీరము యొక్క వస్త్రము
మరియు వస్త్రాన్ని ధారణ చేసే శరీరము వేరుగా అనుభవం అవుతాయో అలా ఆత్మనైన నాకు ఈ
శరీరము ఒక వస్త్రము, నేను వస్త్రాన్ని ధారణ చేసే ఆత్మను అని
స్పష్టంగా అనుభవం అవ్వాలి. అవసరమైనప్పుడు దేహ భావమనే వస్త్రాన్ని ధారణ చేయాలి, అవసరమైనప్పుడు ఈ వస్త్రానికి అతీతంగా అనగా దేహ భావముతో అతీత స్థితిలో
స్థితమైపోవాలి. ఇలాంటి అతీత స్థితి అనుభవం అవుతుందా? వస్త్రాన్ని
నేను ధారణ చేస్తున్నానా లేక వస్త్రము నన్ను ధారణ చేస్తుందా? చైతన్యమైనవారు ఎవరు? యజమాని ఎవరు? అతీత స్థితి
అనుభూతికి గుర్తు - వేరుగా అవ్వడం కాదు, నేను వేరుగా
ఉన్నానని అనుభవమవ్వాలి.
రెండవ
గుర్తు(చిహ్నము) లేక అనుభూతి - భక్తులకు లేక ఆత్మ జ్ఞానులకు లేక కొంతమంది పరమాత్మ
జ్ఞానులకు దివ్య దృష్టి ద్వారా జ్యోతిర్బిందు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కానీ
సాక్షాత్కారము అల్పకాలికమైనది. సాక్షాత్కారము తమ అభ్యాసం యొక్క ఫలం కాదు. ఇది
డ్రామాలో పాత్ర లేక వరదానము. కానీ ఎవర్‌రెడీ అనగా వెంట వెళ్లేందుకు సమానంగా తయారైన
ఆత్మ, సాక్షాత్కారము ద్వారా ఆత్మను చూడలేదు కానీ
బుద్ధి యోగము ద్వారా సదా స్వయాన్ని సాక్షాత్తు జ్యోతిర్బిందు ఆత్మగా అనుభవం చేసుకుంటుంది.
సాక్షాత్తు స్వరూపంగా అవ్వడం సదాకాలం ఉంటుంది, సాక్షాత్కారం
అల్పకాలం కొరకు ఉంటుంది. సాక్షాత్తు స్వరూపాన్ని అనుభవం చేసుకున్న ఆత్మ, నేను ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదు, నేను చూడలేదు
అని ఎప్పుడూ అనదు. కానీ ఆ అనుభవం ద్వారా సాక్షాత్ స్వరూప స్థితిలో స్థితమై
ఉంటుంది. ఎక్కడ సాక్షాత్తు స్వరూపం ఉంటుందో అక్కడ సాక్షాత్కారం యొక్క అవసరం ఉండదు.
ఇలా సాక్షాత్తు ఆత్మ స్వరూపాన్ని అనుభూతి చేసుకున్నవారు నేను ఆత్మను చూడటమే కాదు
కానీ అనుభవం కూడా చేసుకున్నానని అథారిటీతో నిశ్చయంతో చెప్తారు. ఎందుకంటే చూసిన
తర్వాత కూడా అనుభవం చేసుకోకపోతే చూసినా ప్రయోజనం లేదు కదా! కావున ఇలాంటి
సాక్షాత్తు ఆత్మ అనుభవం ఉన్న వారు నడుస్తూ తిరుగుతూ తమ జ్యోతి స్వరూపాన్ని అనుభవం
చేసుకుంటూ ఉంటారు.
మూడవ అనుభూతి -
ఇలాంటి సమాన ఆత్మ అనగా ఎవరెడీ ఆత్మ సాకార ప్రపంచం మరియు సాకార శరీరంలో ఉన్నప్పటికీ
బుద్ధియోగ శక్తి ద్వారా సదా నేను ఆత్మ, సూక్ష్మ వతనంలో
గానీ, మూలవతనంలో గానీ తండ్రి జతలో ఉంటాను అని
అనుభవం చేస్తుంది. సెకండులో సూక్ష్మవతన వాసిగా, సెకండులో
మూలవతన వాసిగా, సెకండులో సాకారవతనవాసి కర్మ యోగిగా అయ్యి
కర్మ చేసే పాత్రను అభినయించే ఆత్మను అని సదా అనుభవం చేస్తుంది. కానీ అనేకసార్లు
స్వయాన్ని తండ్రితో పాటు సూక్ష్మవతనం మరియు మూలవతనంలో ఉన్నట్లు అనుభవం
చేసుకుంటారు. సమయం లభించగానే సూక్ష్మవతనం లేక మూలవతనానికి వెళ్లిపోతారు. ఈ విధంగా
సూక్ష్మవతనవాసిగా, మూలవతనవాసిగా అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే
పని నుండి విశ్రాంతి లభిస్తూనే ఇంటికి వెళ్ళిపోతారో, అలా
మూలవతనవాసిగా అనుభవం చేస్తారు. ఆఫీసు పని పూర్తికాగానే ఇంటికి వెళ్ళిపోతారా లేక
ఆఫీసులోనే కూర్చొని ఉంటారా! ఇలాంటి ఎవరెడీ ఆత్మ మాటి మాటికీ స్వయాన్ని స్వంత ఇంటి
నివాసిగా అనుభవం చేస్తుంది. ఇల్లు ఎదురుగానే ఉన్నట్లుగా అనుభవం చేస్తుంది. ఇప్పుడిప్పుడే
ఇక్కడ ఉంటారు, ఇప్పుడిప్పుడే అక్కడ ఉంటారు. సాకారవతనం అనే
గది నుండి బయటకు వచ్చి మూలవతనం అనే గదిలోకి వెళ్లిపోతారు. మరో అనుభూతి - ఇలా
సమానంగా అయిన ఆత్మ బంధన ముక్తంగా అయిన కారణంగా ఎగిరే పక్షిగా అయ్యి ఉన్నతోన్నతంగా
ఎగురుతూ వెళ్తున్నాను అని అనుభవం చేస్తుంది మరియు ఉన్నత స్థితి అనే స్థానం పై
స్థితులైనందున ఇవన్నీ క్రింద ఉన్నాయి నేను అన్నిటికంటే పైన ఉన్నానని అనుభవం
చేసుకుంటుంది. ఎలాగైతే విజ్ఞాన శక్తి ద్వారా స్పేస్‌లోకి (ఆకాశంలోకి)
వెళ్లినప్పుడు భూమ్యాకర్షణ క్రింద ఉండిపోయి వారు స్వయాన్ని అందరికంటే పైన సదా
తేలికగా అనుభవం చేస్తారో, అలా సైలెన్స్ శక్తి ద్వారా స్వయాన్ని
వికారాల ఆకర్షణ లేక ప్రకృతి ఆకర్షణ అన్నింటికీ అతీతంగా ఎగురుతూ ఉన్న స్థితి అనగా
సదా డబల్‌లైట్ రూపాన్ని అనుభవం చేస్తారు. ఎగిరే అనుభూతి అన్ని ఆకర్షణలకు పైన
ఉన్నతంగా ఉంటుంది. అన్ని బంధనాలతో ముక్తులుగా ఉంటుంది. ఈ స్థితి అనుభూతి అవ్వడం
అనగా ఉన్నతమైన ఎగిరే కళ లేక ఎగురుతూ ఉన్న స్థితి అనుభవం అవ్వడం. నడుస్తూ, తిరుగుతూ వెళ్తూ ఉన్నాము, ఎగురుతున్నాము. తండ్రీ బిందువే, నేనూ బిందువే. ఇద్దరం కలిసి జత జతలో వెళ్తున్నాము అని అనుభూతి చేసుకుంటుంది.
సమాన ఆత్మకు ఈ అనుభవం ఎంత స్పష్టంగా ఉంటుందంటే అది చూస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది.
అనుభూతి నేత్రం ద్వారా చూడటం, దివ్యదృష్టి ద్వారా చూడటం కంటే స్పష్టంగా
ఉంటుంది. అర్థమయ్యిందా? ఇలా విస్తారం అయితే చాలా ఉంది. అయినా సారంలో
కొన్ని గుర్తులు వినిపించాను. ఇలా ఎవరెడీగా అనగా అనుభవీ స్వరూపంగా అయ్యారా? వెంట వెళ్లేందుకు తయారుగా ఉన్నారా లేక ఇప్పుడు ఇంకా ఇది మిగిలిపోయింది అని
అంటారా? ఇలాంటి అనుభవం అవుతుందా లేక ఇంటినే
మర్చిపోయేంతగా సేవలో బిజీ అయ్యారా! సేవ కూడా ఆత్మలకు ముక్తి-జీవన్ముక్తుల వారసత్వం
ఇప్పించడానికే చేస్తున్నారు కదా.
సేవలో కూడా
తండ్రి జతలో వెళ్లాలి అనే స్మృతి ఉంటే సేవలో కూడా సదా అచంచల స్థితి ఉండగలదు. సేవ
విస్తారంలో సారం అనే బీజాన్ని అనుభూతి చేయడం మర్చిపోకండి. విస్తారంలో
నిమగ్నమవ్వకండి. విస్తారంలోకి వస్తూ స్వయం కూడా సార రూపంలో స్థితులవ్వండి మరియు
ఇతరులకు కూడా సార స్వరూపాన్ని అనుభవం చేయించండి. అర్థమయ్యిందా, మంచిది.
ఇలా సదా
సాక్షాత్తు ఆత్మ స్వరూపాన్ని అనుభవం చేసే అనుభవీ మూర్తులు, సదా అందరి లెక్కాచారాలనే వృక్షాన్ని సమాప్తి చేసి బిందువు పెట్టి బిందు రూపంలో
స్థితులై, బిందువైన తండ్రితో పాటు సదా ఉండే, ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే సూక్ష్మ వతన వాసిగా
ఇప్పుడిప్పుడే మూలవతన వాసిగా సదా అభ్యాసం చేసే ఆత్మలకు సదా తమ ఎగిరే కళను అనుభవం
చేసుకునే ఆత్మలు - ఇలా తండ్రి సమానంగా ఎవరెడీగా ఉన్న ఆత్మలకు బాప్‌దాదా ప్రియ
స్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో పాటు
:- (పంజాబ్ మరియు గుజరాత్ జోన్)
1. మాయ నీడ నుండి
రక్షించుకునేందుకు బాబా ఛత్రఛాయ లోపల ఉండండి :-
సదా తమ పై
తండ్రి స్మృతి అనే ఛత్రఛాయను అనుభవం చేస్తున్నారా? స్మృతి అనే
ఛత్రఛాయ ఉందా? ఈ ఛత్రఛాయను ఎప్పుడూ వదిలి పెట్టడం లేదు కదా? ఎవరైతే సదా ఛత్రఛాయలో ఉంటారో, వారు అన్ని రకాల మాయా విఘ్నాల నుండి
సురక్షితంగా ఉంటారు. ఏ విధమైన మాయ నీడ(ఛాయ) వారి పై పడజాలదు. ఈ 5 వికారాలు శత్రువుగా కాకుండా దాసిగా అయ్యి సేవాధారిగా అయిపోతాయి. ఎలాగైతే
విష్ణువు చిత్రంలో పాముల పడక మరియు పాములే ఛత్రఛాయగా అయ్యి ఉండడం చూశారు కదా! ఇది
విజయానికి గుర్తు. కనుక ఇది ఎవరి చిత్రము? మీ అందరి
చిత్రము కదా! ఎవరి పైన విజయం సాధిస్తారో, వారు శత్రువుల
నుండి సేవాధారులుగా అయిపోతారు. ఇలాంటి విజయ రత్నాలుగా ఉన్నారా! గృహస్థీ మాతలుగా
ఉన్నవారు కూడా శక్తులే. శక్తి సైన్యం యొక్క శక్తిగా అయ్యారు. శక్తుల చిత్రంలో రావణ
వంశంలోని రాక్షసులను శక్తుల పాదాల క్రింద ఉన్నట్లుగా చూపిస్తారు. శక్తులు
రాక్షసులను తమ శక్తి అనే పాదం క్రింద అణచి పెట్టారు. శక్తి ఎలాంటి వికారీ
సంస్కారాలనూ పైకి రానివ్వదు.
2. జ్ఞానాన్ని
దానం చేసే సత్యాతి సత్యమైన మహాదానిగా అవ్వండి :-
సదా బుద్ధి
ద్వారా జ్ఞానసాగరుని తీరములో ఉండే అనగా సాగరుని ద్వారా లభించిన తరగని ఖజానాలకు
స్వయాన్ని యజమానులుగా భావిస్తున్నారా? సాగరుడు
సంపన్నంగా, తరగకుండా, అఖండముగా
ఉంటారు. అలాగే ఆత్మలు కూడా మాస్టర్లుగా, అఖండంగా, తరగని ఖజానాలకు యజమానులు. లభించిన ఖజానాలను మహాదానీగా అయ్యి ఇతరుల పట్ల
కార్యంలో వినియోగిస్తూ ఉండండి. మీ సంబంధంలోకి వచ్చే భక్తులు లేక సాధారణ ఆత్మల పట్ల
సదా ఇదే ధ్యాస ఉండాలి - భక్తుల భక్తికి ఫలం లభించాలి, పాపం భ్రమిస్తూ ఉన్నారు. భ్రమించడం చూసి జాలి కలుగుతుంది కదా! ఎంత దయా
హృదయులుగా అవుతూ ఉంటే అంత భ్రమిస్తున్న ఆత్మలకు సహజంగా మార్గం చూపగలరు. సందేశం
ఇస్తూ వెళ్ళండి. ఎవ్వరూ రావడం లేదే అని ఆలోచించకండి. మీరు మహాదానులుగా అవ్వండి.
సందేశం ఇస్తూ వెళ్ళండి. మీ పై ఫిర్యాదులు రాకూడదు. అవినాశీ జ్ఞానం ఎప్పుడూ వినాశనం
కాదు. ఈ రోజు వింటారు ఒక్క నెల తర్వాత ఆలోచిస్తారు, ఆలోచించి
దగ్గరకు వస్తారు. అందువలన ఎప్పుడూ బలహీనంగా అవ్వకండి, వ్యాకులపడకండి. ఎవరు చేస్తారో, వారిది
తప్పకుండా తయారవుతుంది. అంతేకాక ఎవ్వరికి చేస్తారో వారు ఈ రోజు కాకపోతే రేపయినా
తప్పకుండా అంగీకరిస్తారు. కనుక తరగని సేవ అలసట లేకుండా చేస్తూ ఉండండి. ఎప్పుడూ
అలసిపోరాదు. ఎందుకంటే బాప్‌దాదా దగ్గర అందరిదీ జమ తప్పకుండా జరుగుతుంది. ఏదైతే
చేస్తున్నారో దాని ప్రత్యక్ష ఫలం సంతోషం కూడా లభిస్తుంది.
3. వాతావరణాన్ని
శక్తిశాలిగా తయారుచేసే లక్ష్యం ఉంచుకుంటే సేవలో వృద్ధి జరిగే లక్షణాలు కనిపిస్తాయి
-
ఎలాగైతే
మందిరంలోని వాతావరణం దూరం నుండే ఆకర్షిస్తుందో అలా స్మృతి అనే సుగంధ వాతావరణం
ఆత్మను దూరం నుండే ఇది ఒక విశేష స్థానం అని ఆకర్షించే విధంగా శ్రేష్ఠంగా ఉండాలి.
సదా స్మృతి శక్తి ద్వారా స్వయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతేకాక వాతావరణాన్ని
కూడా శక్తిశాలిగా తయారు చెయ్యండి. సేవాకేంద్రం యొక్క వాతావరణం ఆత్మలందరినీ
ఆకర్షించేటట్లుగా ఉండాలి. సేవ కేవలం నోటి ద్వారా మాత్రమే జరగదు. మనసుతో కూడా సేవ
చెయ్యండి. నేను వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చెయ్యాలి, దీనికి నేను భాద్యుడను అని ప్రతి ఒక్కరూ భావించాలి. ఇలాంటి లక్ష్యం
పెట్టుకుంటే సేవ వృద్ధి అయ్యే లక్షణాలు కనిపిస్తాయి. అందరూ వచ్చేది మాత్రం
ఖచ్ఛితం. కానీ కొంతమంది డైరెక్టుగా వస్తారు, కొంతమంది
అన్నిచోట్లా భ్రమించిన తర్వాత వస్తారు. అందువలన నేను జాగృతీ జ్యోతిగా అయ్యి దీపపు
పురుగులు అన్నీ స్వత:గానే వచ్చే దీపముగా అవుతాను అని ప్రతి ఒక్కరూ భావించాలి. మీరు
జాగృతీ జ్యోతిగా అయ్యి కూర్చున్నట్లయితే దీపపు పురుగులు వాటంతట అవే వచ్చేస్తాయి.
మంచిది.
వరదానము :-
'' పరమాత్మ ప్రేమ మరియు అధికారం యొక్క అలౌకిక సంతోషంలో లేక నశాలో ఉండే సర్వ
ప్రాప్తి సంపన్న భవ ''
ఏ పిల్లలైతే తండ్రి జతలో సదా కంబైండ్‌గా ఉండి
''నా బాబా'' అని ప్రేమతో పిలుస్తారో ఆ పిల్లలకు పరమాత్మ
అధికారం ప్రాప్తిస్తుంది. బేహద్ దాత సర్వ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తారు. మూడు
లోకాలకు అధికారిగా అవుతారు. తర్వాత పొందవలసింది పొందాను ఇప్పుడు పొందవలసిందేమీ
లేదు అనే పాట పాడుకుంటారు. వారికి 21 జన్మలకు
గ్యారంటీ కార్డ్ లభిస్తుంది. కనుక నాకు అన్నీ లభించాయి అనే అలౌకిక సంతోషం మరియు
నశాలో ఉండండి.
స్లోగన్ :-
'' సాధనాల ఆధారంతో సాధన ఉండరాదు, సాధనాలు సాధనలో విఘ్న రూపంగా అవ్వరాదు ''
No comments:
Post a Comment