09/05/17 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

మధురమైన పిల్లలూ - అర్ధకల్పము మీరు భౌతికమైన యాత్రలు చేసారు, ఇప్పుడు ఆత్మిక యాత్రను చేయండి, ఇంట్లో కూర్చొని కూడా బాబా స్మృతిలో ఉండడం-ఇది అద్భుతమైన యాత్ర.
ప్రశ్న:-    బాబాకు పిల్లల ఏ విషయముపై చాలా ఆశ్చర్యము కలుగుతుంది?

జవాబు:-            ఏ జాగీరు కొరకైతే పిల్లలు అర్ధకల్పం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారో, మీరు వస్తే మేము మీపై బలిహారమవుతాము అని ఎవరినైతే పిలిచారో ఇప్పుడు వారు వచ్చారు, వారికి చెందినవారిగా అయి కూడా పిల్లలు విడాకులు ఇచ్చేస్తే బాబాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది! పిల్లలు నడుస్తూ, నడుస్తూ ఉన్నతముగా అయ్యేందుకు బదులుగా పూర్తిగా కింద పడిపోతారు!
ప్రశ్న:-    ఏ పిల్లలకు బాబా ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది?
జవాబు:-            ఎవరైతే బాబాచే రచింపబడిన రుద్రయజ్ఞాన్ని బాగా సంభాళిస్తారో మరియు సదా శ్రీమతముపై నడుస్తారో వారికి బాబా ద్వారా మంచి దక్షిణ లభిస్తుంది.
గీతము:- మా తీర్ధాలు అతీతమైనవి.... ఓం శాంతి.
ఆత్మిక యాత్రికులు ఈ గీతమును విన్నారు. పిల్లలైన మీరు ఆత్మిక యాత్రికులు. ఆ యాత్రలకు వెళ్ళేవారిని భౌతిక యాత్రికులు అని అంటారు. ఆ భౌతికమైన యాత్రలు అర్ధకల్పం నడుస్తాయి. జన్మజన్మాంతరాలూ మీరు యాత్రలు చేస్తూ వచ్చారు. ఆ భౌతికమైన యాత్రలు చేసి మళ్ళీ తిరిగి ఇంటికే వస్తారు. ఇది మీ ఆత్మిక యాత్ర. వారు భౌతికమైన పండాలు. మీరు ఆత్మిక పండాలు. పండాలైన మీకు ఆసామి ఎవరు? నిరాకార పరమపిత పరమాత్మ. వారిని పాండవసైన్యపు ఆది పిత అని అంటారు. ఆత్మలైన మనం దేహాభిమానులుగా ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి, ఆత్మలను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు దేహీ అభిమానులుగా తయారుచేస్తారు. కావున ఇప్పుడు మీరు ఆత్మికయాత్రలో ఉన్నారు. ఇందులో కర్మేంద్రియాల విషయమేదీ ఉండదు. యాత్రలకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వికారులుగా అయిపోతారు. యాత్రలకు గృహస్థులే వెళతారు. సన్యాసులు నిజానికి యాత్రలు చేయకూడదు. కానీ వారుకూడా ఇప్పుడు ఈ విషయాలలోకి వచ్చేస్తున్నారు. నివృత్తిమార్గము నిజానికి గృహస్థ ధర్మానికి అతీతమైనది. బ్రాహ్మణులే ఎల్లప్పుడూ యాత్రలకు తీసుకువెళతారు. మేము ఇల్లూ, వాకిళ్ళను, ధన సంపదలను అన్నింటినీ త్యాగం చేస్తాము అని సన్యాసులు అంటారు. కానీ వారి త్యాగము అల్పకాలికమైనది. సతోప్రధాన బుద్ధి ఉన్నంతవరకే ఉంటుంది. మళ్ళీ తమోప్రధానులుగా అయిపోతే డబ్బు మొదలైనవాటికొరకు మళ్ళీ ఇక్కడకు వచ్చేస్తారు. నిజానికి ఇది లా లో లేదు. నాలుగు ధామాలూ చుట్టి వచ్చాము అయినా కానీ తండ్రినుండి దూరముగానే ఉన్నాము అన్న గీతము ఉంది కదా! ఇప్పుడు బాబా యాత్రకు తీసుకువెళ్ళేందుకు మిమ్మల్ని పవిత్రముగా తయారుచేస్తారు, ముక్తిధామంలోకి, జీవన్ముక్తిధామంలోకి తీసుకువెళతారు. మళ్ళీ ఈ పతిత ప్రపంచములోకి వచ్చేదే లేదు. వారు భౌతికమైన తీర్ధయాత్రలు చేసి మళ్ళీ ఇక్కడకే వస్తారు. వచ్చి అశుద్ధమైన వ్యాపారాలు చేస్తారు. యాత్రలలో క్రోధం కూడా చేయకూడదు అని అంటారు. విశేషముగా ఆ సమయంలో పతితులుగా అవ్వరు. నాలుగు ధామాల యాత్రను చేయడంలో 3-4 నెలలు పడుతుంది. ఇప్పుడు ఆత్మలైన మనం వెళుతున్నామని మీకు తెలుసు. ఎంత వీలైతే అంత నా స్మృతిలో ఉండండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. ఇది ముక్తిధామపు యాత్ర. మీరు అక్కడకు వెళుతున్నారు. మీరు అక్కడి నివాసులే. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు మున్ముందుకు వెళతారు అని బాబా రోజూ చెబుతూ ఉంటారు. ఇంట్లో కూర్చొని ఉంటూ కూడా మీరు యాత్రను చేస్తారు. కావున ఇది అద్భుతమైన యాత్రయే కదా! యోగాగ్ని ద్వారా అన్ని పాపాలూ తొలగిపోతాయి. అర్ధకల్పం మీరు భౌతికమైన యాత్రలు చేసారు. మొదట అవ్యభిచారీ యాత్ర జరిగేది. ఆ తరువాత వ్యభిచారీ యాత్రగా మారిపోయింది. పూజ కూడా మొదట ఒక్క శివుడిదే చేసేవారు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, శంకరులను, ఆ తర్వాత లక్ష్మీనారాయణులు మొదలైనవారిని పూజించారు. ఇప్పుడు చూడండి, కుక్క, పిల్లి, రాయి, రప్ప మొదలైనవాటన్నింటినీ పూజిస్తూ ఉంటారు. పిల్లలూ - ఇదంతా బొమ్మల పూజ అని బాబా అర్ధం చేయిస్తారు. వారికి శివబాబా మరియు దేవీ దేవతల కర్తవ్యమునుగూర్చి తెలియదు. బొమ్మలకు ఏ కర్తవ్యమూ ఉండదు. శివబాబా ఆక్యుపేషన్ను గూర్చి తెలుసుకోకపోతే అది రాతి పూజే అవుతుంది. అయినా కానీ ఎంతో కొంత మనోకామన పూర్తి అవుతుంది. సత్యయుగములో భౌతికమైన యాత్ర ఏదీ ఉండదు. అక్కడ మందిరాలు మొదలైనవి ఎక్కడినుండి వస్తాయి? ఇది భ్రష్టాచారీ ప్రపంచము. స్వయాన్ని పతితులుగా భావిస్తారు, కావుననే పావనులుగా అయ్యేందుకు గంగా స్నానాలు చేస్తారు. కుంభమేళా రహస్యాన్ని కూడా అర్ధం చేయించారు. ఇది యథార్ధమైన సంగమము. ఆత్మ, పరమాత్మ ఎంతోకాలంగా దూరంగా ఉన్నారు, సద్గురువైన పతితపావనుడు మధ్యవర్తిగా వచ్చి కలుసుకుంటారు, సుందరమైన మిలనాన్ని జరిపారు అనికూడా గానం చేస్తారు. వారికి తమ శరీరమైతే లేదు. కావున ఈ మధ్యవర్తిద్వారా పిల్లలైన మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. అనగా పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలూ - నేను మిమ్మల్ని శాంతిధామపు యాత్రకు తీసుకువెళ్ళేందుకు, పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను అని అంటారు. భారతదేశము పావనముగా ఉండేదని, ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేదని పిల్లలకు తెలుసు. అక్కడ ఆర్య ధర్మమేమీ లేదు. ఆర్యులు మరియు అనార్యులు అని అంటారు. దేవీ దేవతలను ఆర్యులు అని అన్నట్లయితే మరి ఆర్య ధర్మములో ఎవరు రాజ్యం చేసేవారు? విద్యావంతులను ఆర్యులు అని అంటారు. ఈ సమయంలో అందరూ అనార్యులుగా, విద్యాహీనులుగా ఉన్నారు. వారికి బాప్దాదా(తండ్రిని)ను గూర్చే తెలియదు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. బ్రహ్మ ప్రజాపిత అయినప్పుడు మరి జగదాంబ కూడా ప్రజామాత అవుతుంది కదా! వీరిద్వారా బ్రాహ్మణుల రచన జరుగుతుంది. వీరంతా దత్తత తీసుకోబడిన పిల్లలు. ఎవరు దత్తత తీసుకుంటారు? పరమపిత పరమాత్మ. మనం వారి సంతానమని మీకు తెలుసు. కానీ తండ్రిని మరిచి అనాధలుగా అయిపోయాము. భగవంతుడైన తండ్రి కర్తవ్యమునుగూర్చి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి మళ్ళీ ఇటువంటి వాళ్ళను పావనముగా తయారుచేస్తారు. బాబాయే పిల్లలైన మీకు పవిత్రతా శిక్షణను ఇస్తారు. ఇప్పుడు ఎవరివద్దకైతే వెళ్ళాలో వారిని స్మృతి చేయాలి. మాయ ఘడియ ఘడియా మరిపింపజేస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా! మీరు బాబాకు చెందినవారిగా అవుతారు. మాయ మళ్ళీ తనవారిగా చేసుకుంటుంది. ఇది ప్రభువు మరియు మాయల నాటకము. బాబాకు చెందినవారిగా అయి, ఆశ్చర్యవంతులై విని మళ్ళీ పారిపోతారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. ఈ బుద్ధియోగ శక్తి యొక్క యుద్ధమును బాబా తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. సర్వశక్తివంతుడైన బాబాతో యోగమును జోడించడం ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు పవిత్రముగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు ఈ శరీరాన్ని ధరించాము. మనం 84 జన్మలను పూర్తి చేసాము. ఇది చివరి సమయపు చిన్నని మహా కళ్యాణకారీ యుగము. జ్ఞానగంగలైన మీరందరూ జ్ఞానసాగరునినుండి వెలువడతారు.

బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆయువుకూడా పెరుగుతుంది మరియు భవిష్య 21 జన్మల కొరకు కూడా మీరు అమరులుగా అవుతారు అని బాబా చెబుతున్నారు. అకాలమృత్యువు ఎప్పుడూ జరుగదు. సమయం వచ్చినప్పుడు తమకు తామే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. నడుస్తూ, తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. ఈ స్మృతిద్వారా మీరు సృష్టిని పావనముగా తయారుచేస్తారు. పావనముగా తయారుచేసేందుకే బాబా వచ్చారు. ఎవరైతే ఒకప్పుడు దేవతలుగా ఉన్నారో వారి అంటుయే అంటుకుంటుంది. ఇప్పుడు శూద్రులుగా అయ్యారు, ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. వారందరూ ఇప్పుడు తిరిగి వస్తారు. అందరికీ తమ తమ సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడకూడా అందరికీ తమ తమ ఆచారం ఉంటుంది. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు అంటు కట్టబడుతోంది. ఎవరైతే మొదట బ్రాహ్మణులుగా అయ్యారో వారే వస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. బ్రహ్మకు చెందినవారిగా అవ్వకపోతే శివబాబానుండి వారసత్వాన్ని పొందలేరు. దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు బ్రాహ్మణ ధర్మములోకి తప్పకుండా వస్తారు. ఇప్పుడు మీరు ముళ్ళనుండి పుష్పాలుగా అయ్యారు. ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరు. అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు. పంచవికారాల రూపీ శత్రువు గుప్తముగా ఉన్నాడు. అర్ధకల్పం అందరిచేతా యుద్ధం చేయించి కిందపడవేసి పతితులుగా చేసేసాడు. ఇప్పుడు తండ్రి యజ్ఞాన్ని రచించారు. అనంతమైన తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. అందులో అంతా స్వాహా చేయాలి. ఈ గుర్రముపై ఆత్మ విరాజమనమై ఉంది. దీని పేరే స్వరాజ్యము. రాజ్యముకొరకే రుద్రజ్ఞాన యజ్ఞము రచించడం జరుగుతుంది. స్వర్గస్థాపన కొరకు ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించడం జరిగింది! ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన చెందనున్నదని మీకు తెలుసు. మీ హృదయంలో ఆ నషా ఉంటుంది. బాబా యజ్ఞాన్ని రచించారు, దీనిని బాగా సంభాళించాలి. ఎవరైతే శ్రీమతముపై నడుస్తారో వారికి చాలా మంచి దక్షిణ లభిస్తుంది. యజ్ఞమును బాగా సంభాళించినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఏ ఆసామి కొరకైతే మీరు అర్ధకల్పం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారో వారు లభించారు. తండ్రి అన్నీ ఇచ్చేందుకు వస్తారు, మరి ఇటువంటి తండ్రిని వదిలి వెళ్ళిపోతే బాబా ఆశ్చర్యపోతారు. మీపై బలిహారమవుతాము అని ప్రేయసులు గానం చేసేవారు. ఇప్పుడు నేను వచ్చాక మీరు నాకు చెందినవారిగా అయి కూడా నన్ను వదిలేస్తున్నారే! అటువంటివారు పైకి ఎక్కేందుకు బదులుగా కిందకు దిగజారిపోతారు. పైకి ఎక్కితే వైకుంఠ రసానుభూతిని పొందుతారు. తేడా అయితే ఉంది కదా! ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారు ఎక్కడ? పేదవారు, ఆటవికులు ఎక్కడ? కావున ఇప్పుడు పురుషార్ధం చేసి బాబానుండి రాజ్యాన్ని పొందాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. కానీ ఇందులో కృష్ణుని పేరును వేసేసారు. వ్యాస భగవానుడు ఈ గొప్పలన్నింటినీ వ్రాసేసాడు. భక్తిమార్గం కొరకు ఈ శాస్త్రాలు మొదలైన వస్తువులు తయారయ్యాయి. భగవంతుడు ఒక్కడే, అతడినే పతితపావనుడు అని అంటారు. శాంతిధామము మరియు సుఖధామములలో ఎవ్వరూ పిలువరు. కావున పిల్లలకు పూర్తి నషా ఎక్కి ఉండాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, దీని తర్వాత ఇంకే యజ్ఞమూ రచించబడదు. ఆపదలను తొలగించుకునేందుకు ఆ భౌతికమైన యజ్ఞాలను రచిస్తారు. బాబా అర్ధకల్పం వరకూ ఆపదలన్నింటినీ అంతం చేస్తారు. ఈ విషయమునుగూర్చి సాధుసన్యాసులకు ఎవ్వరికీ తెలియదు. ముఖ్యమైనది గీతా మాత. దానిని భగవంతుడు గానం చేసారు. కానీ అందులో కృష్ణుని పేరు వేసేసారు. కావున ఇప్పుడు మనుష్యులను అప్రమత్తం చేయాలి, ఎందుకంటే వారి బుద్ధియోగం కృష్ణునితో జోడింపబడి ఉంది. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే నాతో తీసుకువెళతాను అని కృష్ణుడు అయితే అనడు కదా! ఇక్కడ బాబా కూర్చొని అర్హులుగా తయారుచేస్తారు. నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారుచేస్తారు, మీరు నల్లగా అయిపోయారు. బాబా మళ్ళీ సుందరముగా, స్వర్గానికి అర్హులుగా తయారుచేస్తారు. నడుస్తూ, తిరుగుతూ బాబాను స్మృతి చేయాలి. ఈ స్థితి ఏర్పడినట్లయితే మీ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఆరోగ్యము, సంపద, ఆనందము, సుఖము లభిస్తాయి. బాబానుండి మీరు ఎంతో వారసత్వాన్ని పొందుతారు, మరి ఇటువంటి తండ్రిని మీరు ఎంతగా స్మృతి చేయాలి, వారి శిక్షణపై ఎంతగా నడవాలి! ముళ్ళను పుష్పాలుగా తయారుచేయాలి. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు, ఇది ఒక తోట. ఇప్పుడు ఉన్నది ముళ్ళ అడవి. అకాసురుడు, బకాసురుడు మొదలైన పేర్లన్నీ సంగమయుగానికి చెందినవే. అందరి ఉద్ధరణ జరగాలి. ఎవరు ఎంతగా చదివిస్తారో మరియు శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారు బాబానుండి 21 తరాల వరకు వారసత్వాన్ని పొందుతారు. మీరు సదా సుఖమయంగా అయిపోతారు, ఇప్పుడు మీది 100 శాతం పైకి ఎక్కే కళ. మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయంలో కళలు పూర్తిగా అంతమైపోయాయి. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అనికూడా గానం చేస్తారు. తండ్రిని దయాసాగరుడు అని అంటారు కదా! వారు కల్పకల్పము సంగమయుగములో వస్తారు. భారతదేశము స్వర్గముగా ఉన్నప్పుడు అందరూ సుఖమయంగా అయిపోతారు. పిల్లలు శ్రీమతంపై నడవాలేకానీ అసురీమతముపై నడవకూడదు. అందరికన్నా ఎక్కువగా నన్నే గ్లాని చేస్తారు, నన్ను నామరూపాలకు అతీతుడు అని అయినా అంటారు లేక కణకణములోనూ ఉన్నాడు అని అయినా అంటారు. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. మీరు ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు మరియు బాబాను తెలుసుకొని బాబానుండి వారసత్వాన్ని పొందుతున్నారు. ఇప్పుడు రక్తసిక్తమైన ఆట జరుగనున్నది. ఎన్నో ఆపదలు వస్తాయి, ఎంతోమంది మరణిస్తారు. శాస్త్రాలలో ఎన్నో విషయాలను వ్రాసేసారు కానీ బుద్ధితో ఏమీ అర్ధం చేసుకోరు. బాబా వచ్చి బుద్ధిని ఇస్తారు, మీకు సత్యమైన విషయాలను నేను వినిపిస్తున్నానా లేక శాస్త్రాలు సత్యమైనవా? అని ఇప్పుడు మీరే నిర్ణయించండి అని అంటారు. అందులో ఏవేవో విషయాలను వ్రాసేసారు. దేవతల చిత్రాలను ఎన్నో తయారుచేస్తారు, ఎంతో ఖర్చు చేస్తారు. దేవీలను తయారుచేసి, పూజించి మళ్ళీ ముంచేస్తారు. మరి అది బొమ్మలపూజ వంటిదే కదా! కాళి చిత్రాన్ని ఎలా తయారుచేస్తారో చూడండి! నిజానికి అటువంటి మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు యాత్రలో ఉన్నారు. రైలులో కూర్చొని కూడా ఆత్మిక యాత్రలో ఉంటారు. బుద్ధి యాత్రలో నిమగ్నమై ఉంటుంది. బుద్ధియోగము జోడింపబడి ఉండకపోతే ఆ సమయం వ్యర్ధమైపోతుంది. సమయాన్ని వ్యర్ధం చేయకండి అని బాబా అంటారు. మీ సమయం చాలా విలువైనది. ఒక్క క్షణాన్ని కూడా సంపాదన లేకుండా వదలకండి. బాబా పూర్తి పురుషార్ధాన్ని చేయిస్తారు. బాబా విశ్వాన్ని స్వర్గంగా తయారుచేసేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు. బాబా, బాబా అని అంటూ ఉంటే మీ నావ తీరాన్ని చేరుతుంది. మనం బ్రాహ్మణులము. మనపై ఎంతో పెద్ద బాధ్యత ఉంది. పిల్లలూ - ఆత్మాభిమానులుగా అవ్వండి, మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి, చాలా మధురముగా అవ్వండి అని బాబా అంటారు. క్రోధం ద్వారా చాలా డిస్సర్వీస్ జరుగుతుంది. నేర్పించేవారిలో ఏదైనా భూతము ఉంటే వెంటనే బాబాకు రిపోర్ట్ చేయాలి. వీరిలో ఈ అహంకారము ఉంది, ఇది, ఇది ఉంది అని చెప్పాలి. తద్వారా బాబా అప్రమత్తం చేస్తారు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు కదా! భూతాలు చాలా అశుద్ధమైనవి. అచ్ఛా!

మధురాతిమధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయం చాలా విలువైనది, కావున ఒక్క క్షణం కూడా ఈ సంపాదన లేకుండా వదలకూడదు. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్ధం చేయాలి.

2. నడుస్తూ, తిరుగుతూ బాబాను స్మృతి చేస్తూ మీ స్థితిని తయారు చేసుకోవాలి. చాలా మధురముగా అవ్వాలి, ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకూడదు.

వరదానము:-       యజమానత్వపు స్మృతిద్వారా శక్తులను ఆర్డర్ ప్రమాణంగా నడిపించే స్వరాజ్య అధికారీ భవ.
బాబాద్వారా ఏ శక్తులైతే లభించాయో ఆ సర్వ శక్తులను కార్యములో వినియోగించండి. అవసరమైన సమయములో శక్తులను ఉపయోగించండి. కేవలము యజమానత్వపు స్మృతిలో ఉండి ఆర్డర్ చేసినట్లయితే శక్తులు మీ ఆజ్ఞను పాటిస్తాయి. ఒకవేళ బలహీనురై ఆర్డర్ చేసినట్లయితే అవి ఆజ్ఞను పాటించవు. బాప్దాదా పిల్లలందరినీ యజమానిగా చేస్తారు, బలహీనురుగా కాదు. పిల్లలందరూ రాజా పిల్లలే ఎందుకంటే స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారము. ఈ అధికారమును ఎవ్వరూ మీనుండి లాక్కోలేరు.
స్లోగన్:-  త్రికాలదర్శి స్థితిలో స్థితులై కర్మ చేసినట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment