08/05/17 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

“మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు, ఈశ్వరీయ కుటుంబపు నియమము - అందరూ సోదరులుగా ఉండడం, బ్రాహ్మణ కులపు నిబంధనలో సోదరీ సోదరులుగా ఉండాలి కావున వికారీ దృష్టి ఉండకూడదు.”
ప్రశ్న:-     ఈ సంగమయుగము కళ్యాణకారీ యుగము, అది ఎలా?

జవాబు:-     ఈ సమయములోనే తండ్రి తమ మధురమైన పిల్లల సమ్ముఖములోకి వస్తారు మరియు తండ్రి, శిక్షకుడు, సద్గురువు పాత్ర ఇప్పుడే నడుస్తుంది. ఈ కళ్యాణకారీ సమయంలోనే పిల్లలైన మీరు అతీతమైన, నరకమునుండి స్వర్గముగా తయారుచేసే, అందరికీ సద్గతిని ఇచ్చే బాబా శ్రీమతమును తెలుసుకుంటారు మరియు దానిపై నడుస్తారు.
ప్రశ్న:-     మీ సన్యాసము సతోప్రధానమైన సన్యాసము, అది ఎలా?
జవాబు:-     మీరు బుద్ధిద్వారా ఈ పాత ప్రపంచమునంతటినీ మరిచిపోతారు. మీరు ఈ సన్యాసములో కేవలం బాబా మరియు వారసత్వమును స్మృతి చేస్తారు, పవిత్రముగా అవుతారు మరియు నియమానుసారముగా నడుచుకుంటారు. దీనిద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. వారి సన్యాసము హద్దులోనిదే కానీ అనంతమైనది కాదు.
గీతము:-     భోలానాధుని కన్నా అతీతమైనవారు ఎవరూ లేరు.... ఓం శాంతి.

స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మొట్టమొదట బాబా పిల్లలకు అర్ధం చేయిస్తారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా బాబా మన్మనాభవ అని అన్నారు. దేహపు సర్వసంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. అందరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? ఎవ్వరూ స్వయాన్ని పరమాత్మగా భావించడంలేదు కదా! పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అనికూడా అంటారు కదా! అంతేకానీ మహా పరమాత్మ అని అనరు. ఆత్మ పవిత్రముగా అయితే శరీరముకూడా పవిత్రమైనదే లభిస్తుంది. మలినాలు ఆత్మలోనే కలుస్తాయి. బాబా పిల్లలకు యుక్తిగా అర్ధం చేయిస్తారు. ఆత్మరూపంలో మనమందరమూ సోదరులమవుతాము మరియు శరీర సంబంధములోకి వచ్చినట్లయితే సోదరీ సోదరులమవుతాము. ఎంతోమంది యుగళులు కూర్చొని ఉన్నారు. మీరు పరస్పరం సోదరీ సోదరులుగా భావించండి అని చెబితే గొడవ చేస్తారు, కావున ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరేనని, కావున పరస్పరం సోదరులమవుతామని ఈ నియమాన్ని అర్ధం చేయించడం జరుగుతుంది. మనుష్య తనువులోకి వచ్చినప్పుడు ప్రజాపిత బ్రహ్మద్వారా రచనను రచిస్తారు. మరి తప్పకుండా వారి ముఖ వంశావళి పరస్పరం సోదరీ సోదరులవుతారు కదా! పరమపిత పరమాత్మ అని అందరూ అంటారు. తండ్రి స్వర్గ రచయిత, మనం వారి పిల్లలము. మరి మనంకూడా స్వర్గానికి అధిపతులుగా ఎందుకు అవ్వకూడదు? కానీ స్వర్గం సత్యయుగములోనే ఉంటుంది. తండ్రి వచ్చి కొత్త సృష్టిని ఏమీ రచించరు. బాబా వచ్చి పాతదాన్ని కొత్తగా తయారుచేస్తారు. అనగా ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు. తప్పకుండా తండ్రి ఇక్కడకు వచ్చారు. భారతదేశమునకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. దాని స్మృతిచిహ్నముగా సోమనాధ మందిరాన్ని చాలా పెద్దగా నిర్మించారు. తప్పకుండా భారతదేశములో ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉండేది. అప్పుడు ఇంకే ధర్మమూ లేదు. మిగిలినవన్నీ తర్వాత వృద్ధినొందాయి. కావున తప్పకుండా మిగిలిన ఆత్మలన్నీ నిర్వాణధామములో తండ్రి వద్దే ఉంటాయి కదా! భారతవాసులు జీవన్ముక్తులుగా ఉండేవారు. సూర్యవంశ రాజ్యములో ఉండేవారు. ఇప్పుడు జీవనబంధనలో ఉన్నారు. జనకుని ఉదాహరణ కూడా ఉంది. అతడికి క్షణములో జీవన్ముక్తి లభించింది అని అంటారు. జీవన్ముక్తి అని మొత్తం స్వర్గమంతటినీ అంటారు. మళ్ళీ అందులో ఎవరైతే బాగా కష్టపడతారో వారు అంతగా పదవిని పొందుతారు. జీవన్ముక్తులు అని అందరినీ అంటారు. మరి తప్పకుండా ముక్తి, జీవన్ముక్తి దాత ఒక్క సద్గురువే అయి ఉండాలి కదా! కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అంతా మాయ బంధనలో ఉన్నారు. ఈశ్వరుని గతి, మతి అతీతమైనది అని అంటారు. అతడిది శ్రీమతము, వారు తప్పకుండా వస్తారు. చివరిలో అందరూ అహో ప్రభూ అని అంటారు. అహో ప్రభూ! నీ ఈ నరకమును స్వర్గముగా తయారుచేసే గతి చాలా అతీతమైనది అని ఇప్పుడు మీరు అంటున్నారు. మళ్ళీ మనము సహజ రాజయోగమును నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. కల్పపూర్వము కూడా సంగమయుగములోనే నేర్పించి ఉంటారు కదా! ఓ మధురమైన పిల్లలూ - అని బాబా స్వయంగా పిలుస్తున్నారు. నేను పిల్లలైన మీ సమ్ముఖములోకే వస్తాను. అతడు ఉన్నతోన్నతుడైన తండ్రి, అలాగే ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా. వారు జ్ఞానమును ఇస్తారు. ఇంకెవ్వరూ ఈ సృష్టిచక్రపు జ్ఞానమును ఇవ్వజాలరు. ఈ సృష్టిచక్రపు ఆదిమధ్యాంతము లేక ప్రపంచ చరిత్ర - భౌగోళములను గూర్చి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ స్థాపన మరియు వినాశనముల కార్యమును ఎలా చేయిస్తారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మనుష్యులనుండి దేవతలుగా తయారుచేసారు అన్న మహిమ వారిదే. వారు మురికిపట్టిన బట్టలను ఉతుకుతారు. ఇప్పుడు నేను మురికిపట్టి ఉన్నానా? లేక పవిత్రముగా ఉన్నానా? అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, ఇది అకాల సింహాసనము కదా! అకాలమూర్తుని ఆసనము ఏది? ఎక్కడ ఉంది? అది తప్పకుండా పరంధామము లేక బ్రహ్మ మహాతత్వమే. ఆత్మలైన మనము కూడా అక్కడే ఉంటాము. దానిని కూడా అకాల్తక్త్ అని అంటారు. అక్కడకు ఎవ్వరూ రాజాలరు. ఆ మధురమైన ఇంట్లో మనము ఉంటాము. బాబా కూడా అక్కడే ఉంటారు. అంతేకానీ అక్కడ సింహాసనము లేక కుర్చీలు మొదలైనవి ఉండవు. అక్కడ అశరీరులుగా ఉంటారు కదా! కావున క్షణములో జీవన్ముక్తి లభిస్తుందని అనగా అర్హులుగా అవుతారని అర్ధం చేయించాలి.

శివబాబాను స్మృతి చేయండి, విష్ణువును స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇప్పుడు మీరు బ్రహ్మాపురిలో కూర్చున్నారు. మీరు బ్రహ్మ సంతానము మరియు శివబాబా పిల్లలు కూడా. స్వయాన్ని సోదరీ సోదరులుగా భావించకపోతే కామ వికారములోకి వెళ్ళిపోతారు. ఇది ఈశ్వరీయ కుటుంబము. మొదట మీరు కూర్చున్నారు, దాదా కూడా ఉన్నారు, అలాగే బాబా కూడా ఉన్నారు మరియు వారి పిల్లలైన మీరు కూడా ఉన్నారు, కావున మీరు బ్రహ్మ ద్వారా శివబాబా సంతానమయ్యారు. కావున శివునికి మీరు మనుమలవుతారు. మళ్ళీ మనుష్యతనువులో ఉన్నప్పుడు సోదరీ సోదరులవుతారు. ఈ సమయంలో మీరు ప్రాక్టికల్గా సోదరీసోదరులుగా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల కులము. ఇది బుద్ధిద్వారా అర్ధం చేసుకోవలసిన విషయం. జీవన్ముక్తి కూడా క్షణములో లభిస్తుంది. మిగిలిన పదవులు ఎన్నో ఉన్నాయి. అక్కడ దుఃఖమునిచ్చే మాయ ఉండదు. సత్యయుగమునుండి కలియుగము వరకు రావణుడ్ని తగులబెడుతూ ఉండరు, ఇలా పరంపరగా తగులబెడుతూ వస్తున్నాము అని ఏదైతే అంటారో అది అసంభవము. స్వర్గములోకి అసురులు ఎక్కడినుండి వస్తారు? ఇది అసురీ సాంప్రదాయమని బాబా తెలియజేసారు. కావున వారికి అకాసురుడు, బకాసురుడు అన్న పేర్లను పెట్టారు. కృష్ణుడు గోవులను దొంగిలించాడని అంటారు. ఈ పాత్ర కూడా నడిచింది. శివబాబా గోవులు మీరే కదా! శివబాబా అందరికీ జ్ఞానమనే గడ్డిని తినిపిస్తారు. ఈ గడ్డిని తినిపించేవారు, పాలన చేసేవారు వారే.

మనుష్యులు మందిరాల్లోకి వెళ్ళి దేవతల మహిమను గానం చేస్తారు, మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము అని అంటారు. స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. హిందువులము అని అంటారు. దీని యథార్ధమైన నామము భారతఖండము. గీతలో కూడా యథా యథాహి ధర్మస్య అని భారతఖండము పేరే చెప్పారు. గీతలో హిందుస్థాన్ అని అయితే అనలేదు కదా! ఇది భగవానువాచ! భగవంతుడు ఒక్క నిరాకారుడే. వారినిగూర్చే అందరికీ తెలుసు. స్వర్గములో అంతా దైవీగుణాలు కలిగిన మనుష్యులే ఉంటారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. కావున తప్పకుండా స్వర్గమునుండి నరకములోకి వస్తారు కదా! మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారు. దానికి కూడా అర్ధం ఉంటుంది కదా! నెంబర్ వన్ పూజ్యుడు శ్రీకృష్ణుడు. కిశోరావస్థను సతోప్రధాన అవస్థ అని అంటారు. బాల్యావస్థను సతో అని, యవ్వనమును రజో అని, వృద్ధావస్థను తమో అని అంటారు. సృష్టి కూడా సతో, రజో, తమోలుగా అవుతుంది. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము రావాలి. తండ్రి సంగమయుగములోనే వస్తారు. ఇది చాలా కళ్యాణకారీ యుగము. ఇటువంటి యుగము ఇంకేదీ ఉండజాలదు. సత్యయుగమునుండి త్రేతాయుగములోకి వస్తారు. దానిని కళ్యాణకారి అని అనరు. ఎందుకంటే రెండు కళలు తగ్గిపోయాయి. మరి దానిని కళ్యాణకారీ యుగము అని ఎలా అంటారు? మళ్ళీ ద్వాపరయుగములోకి వస్తే కళలు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. కావున ఇది కళ్యాణకారీ యుగము కాదు. ఈ సంగమయుగమే కళ్యాణకారీ యుగము. ఇప్పుడు బాబా విశేషముగా భారతఖండమునకు మరియు అందరికి కూడా గతి, సద్గతిలను ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గముకొరకు పురుషార్ధము చేస్తున్నారు. ఈ దేవీ దేవతా ధర్మమే సుఖమునిస్తుందని బాబా అంటారు. మీరు మీ ధర్మాన్ని మరిచిపోయారు కావుననే ఇతర ధర్మాలలోకి దూరిపోతారు. నిజానికి మీ ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ రాజయోగమునే నేర్చుకుంటున్నారు కావున శ్రీమతముపై నడవవలసి ఉంటుంది. మిగిలినవారంతా రావణుని అసురీమతముపై ఉన్నారు. అందరిలోనూ పంచవికారాలు ఉన్నాయి. వీటిలోనూ మొట్టమొదటిది అశుద్ధ అహంకారము. దేహ అహంకారాన్ని వదిలి దేహీ అభిమానిగా అవ్వండి, అశరీరి భవ అని బాబా అంటారు. మీరు తండ్రినైన నన్ను మరిచిపోయారు, ఇది బయటికి వచ్చే దారి తెలియని ఆట. తప్పక కిందకు దిగజారవలసిందే కదా! మరి పురుషార్ధం ఎందుకు చేయాలి? అని కొందరు అంటారు. అరే, పురుషార్ధం చేయకపోతే స్వర్గ రాజ్యము ఎలా లభిస్తుంది? డ్రామాను కూడా అర్ధం చేసుకోవాలి. ఈ సృష్టి ఒక్కటే, దీని చక్రం తిరుగుతుంది. సత్యయుగ ఆది సత్యము.... ఆని ఆంటారు. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము పునరావృతమవుతుంది అని కూడా అంటారు. అలా అయితే అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎలా పునరావృతమవుతుంది? దీనికొరకే మీరు పురుషార్ధము చేస్తున్నారు. మళ్ళీ మీకు నేను రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను అని బాబా అంటారు. మీరుకూడా నేర్చుకుంటారు, రాజ్యస్థాపన జరుగుతుంది. యాదవులు, కౌరవులు అంతమొందుతారు, మళ్ళీ జయజయ ధ్వనులు మారుమ్రోగుతాయి. ఆ తర్వాత ముక్తి, జీవన్ముక్తుల ద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే అప్పటివరకు దారి మూసుకొని ఉంటుంది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడే ద్వారాలు తెరుచుకుంటాయి. బాబా వచ్చి మార్గదర్శకునిగా అయి తీసుకొని వెళతారు. వారు ముక్తిప్రదాత కూడా. మాయ సంకెళ్లనుండి విముక్తులను చేస్తారు. గురువుల సంకెళ్ళలో ఎంతగానో చిక్కుకొని ఉన్నారు. గురువు ఆజ్ఞను పాటించకపోతే ఏదైనా శాపం దొరుకుతుందేమోనని ఎంతగానో భయపడుతూ ఉంటారు. అరే, అసలు మీరు ఆజ్ఞను ఎక్కడ పాటిస్తున్నారు? మీ గురువు నిర్వికారిగా, పవిత్రునిగా ఉంటాడు మరియు మీరు వికారులుగా, అపవిత్రులుగా ఉంటారు. గురువుపై మనుష్యులకు ఎంతో భావన ఉంటుంది, కానీ వారు ఏం చేస్తున్నారో వారికేమీ తెలియదు. భక్తిమార్గపు ప్రభావము ఉంది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతనవాసులని మీకు తెలుసు. అందులోనూ బ్రహ్మనుండి విష్ణువుగా అయ్యే పాత్ర ఇక్కడ ఉంది. శంకరుడు ఇక్కడకు రావలసిన అవసరం లేదు. ఇక్కడ జగదాంబ, జగత్పిత మరియు పిల్లలైన మీరు ఉంటారు. ఎన్నో భుజాలు కలిగిన దేవతలు మొదలైనవారిని ఎందరినో తయారుచేస్తూ ఉంటారు. లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ భక్తిమార్గముకొరకు. మనుష్యులు మనుష్యులే కదా! రాధాకృష్ణులు మొదలైనవారికి నాలుగు భుజాలను చూపించారు. దీపావళినాడు మహాలక్ష్మిని పూజిస్తారు. అందులో రెండు భుజాలు లక్ష్మివి, రెండు భుజాలు నారాయణునివి. కావున ఇరువురి పూజ కంబైన్డ్రూపంలో జరుగుతుంది. ఇది ప్రవృత్తిమార్గము, అంతేకానీ ఇంకేమీ లేదు. కాళి నాలుకను చూపిస్తూ ఉంటుంది. కృష్ణుడినికూడా నల్లగా తయారుచేసారు, వామమార్గములోకి వెళ్ళిన కారణముగా నల్లగా అయిపోతుంది, మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోవడం ద్వారా తెల్లగా అయిపోతుంది. జగదాంబ, ఇటువంటి మధురమైన మమ్మా అందరి మనోకామనలను పూర్తి చేస్తుంది. అటువంటి తన మూర్తిని కూడా నల్లగా చేసేసారు. ఎంతోమంది దేవతలను తయారుచేస్తారు. పూజించి సముద్రములో ముంచివేస్తారు. కావున ఇది బొమ్మల పూజ అవుతుంది కదా! ఇదంతా డ్రామాలో రచింపబడి ఉందని, ఇది మళ్ళీ జరుగుతుందని బాబా అన్నారు. భక్తిమార్గపు విస్తారము ఎంతగానో ఉంది. ఎన్నో మందిరాలు, ఎన్నో చిత్రాలు, శాస్త్రాలు మొదలైనవి చెప్పలేనంతగా ఉన్నాయి. ఎంతో సమయమును, ఎంతో ధనమును వ్యర్ధం చేస్తున్నారు. మనుష్యులు ఈ సమయంలో పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలిగినవారుగా ఉన్నారు, గవ్వల సమానముగా అయిపోతారు. ఇప్పుడు భక్తిమార్గపు దెబ్బలు ఎన్నో తిన్నారు, ఇక బాబా మిమ్మల్ని ఈ జంజాటములనుండి విడిపిస్తారు, కావున ఒక్క బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి మరియు పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి, పత్యము కూడా చేయవలసి ఉంటుంది లేకపోతే అన్నమును బట్టి మనస్సు ఏర్పడుతుంది, అందుకే సన్యాసులు కూడా గృహస్థుల వద్దే జన్మ తీసుకోవలసి ఉంటుంది అని బాబా తెలియజేస్తున్నారు, అది రజోప్రధాన సన్యాసము, ఇది సతోప్రధాన సన్యాసము. మీరు పాత ప్రపంచమును సన్యసిస్తారు. ఆ సన్యాసములోకూడా ఎంతో శక్తి ఉంది. ప్రెసిడెంట్ కూడా గురువుల ముందు తల వంచుతాడు. భారతదేశము ఎంతో పవిత్రముగా ఉండేది, దాని మహిమ గానం చేయబడుతుంది. భారతవాసులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా ఉన్నారు. దేవతల మందిరాలలోకి వెళతారు, మరి తప్పకుండా ఆ ధర్మానికి చెందినవారే అయి ఉంటారు కదా! గురునానక్ మందిరములోకి వెళతారు మరి తప్పకుండా వారు సిక్కుధర్మానికి చెందినవారే అయి ఉంటారు కదా! కానీ వీరంతా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా పిలుచుకోలేరు, ఎందుకంటే పవిత్రులుగా లేరు.

ఇప్పుడు నేను మళ్ళీ శివాలయాన్ని తయారుచేసేందుకు వచ్చాను అని బాబా చెబుతున్నారు. స్వర్గములో కేవలం దేవీ దేవతలే ఉంటారు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. గీత, రామాయణము మొదలైనవన్నీ అంతమవ్వనున్నాయి. డ్రామానుసారముగా మళ్ళీ తమ సమయంలో అవి వెలువడతాయి. ఇవి ఎంతగానో అర్ధం చేసుకోవలసిన విషయాలు. ఇది మనుష్యులనుండి దేవతలుగా తయారుచేసే పాఠశాల. కానీ మనుష్యులు మనుష్యుల సద్గతిని ఎన్నటికీ చేయజాలరు. అల్పకాలికమైన సుఖమును అందరూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది అల్పకాలికమైన సుఖము, ఇక మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. సత్యయుగములో దుఃఖము అన్న మాటే ఉండదు. దాని పేరే స్వర్గము, సుఖధామము. స్వర్గము పేరు ఎంతో ప్రసిద్ధమైనది. గృహస్థ వ్యవహారములో ఉంటున్నా కానీ ఈ అంతిమజన్మలో బాబా, నేను మీ సంతానమును, ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచపు వారసత్వాన్ని తీసుకుంటాను అని ప్రతిజ్ఞ చేయాలి. బాబాను స్మృతి చేయడం చాలా సహజం, అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహ అహంకారాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి, అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి.

2. డ్రామాను యథా ర్ధ రీ తిగా అ ర్ధం చేసుకొని పురు షా ర్ధం చేయాలి. డ్రామాలో ఉంటే చేస్తానులే అని ఆలోచిస్తూ పురుషా ర్ధ హీనులుగా అవ్వకూడదు.
వరదానము:-     కల్యాణకారీ సమయపు స్మృతితో తమ భవిష్యత్తును తెలుసుకునే మాస్టర్ త్రికాలదర్శీ భవ.
మీ భవిష్యత్తు ఏమిటి? అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినట్లయితే- చాలా బాగుంటుందని మాకు తెలుసు, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో అది చాలా మంచిగా ఉంటుందని మాకు తెలుసు అని చెప్పండి. జరిగిపోయినదికూడా మంచిదే, జరుగుతున్నదీ మంచిది మరియు జరగబోయేది ఇంకా చాలా చాలా మంచిది. ఇది కల్యాణకారీ సమయము, బాబా మా కల్యాణకారి మరియు మేము విశ్వ కల్యాణకారులము కనుక మాకు అకల్యాణము అన్నది జరగజాలదు అన్న ఈ నిశ్చయము త్రికాలదర్శి పిల్లలకు ఉంటుంది.
స్లోగన్:-     సమాప్తి సమయమును సమీపంగా తీసుకురావాలనుకున్నట్లయితే సంపూర్ణంగా అయ్యే పురుషార్థమును చెయ్యండి.

No comments:

Post a Comment