08-05-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు ఈశ్వరీయ కుటు౦బమునకు చె౦దినవారు, ఈశ్వరీయ కుటు౦బములో నియమము - భాయి-భాయిగా ఉ౦డడం. బ్రాహ్మణ కులములోని నియమము - సోదరీ-సోదరులుగా ఉ౦డడం. కావున వికారి దృష్టి ఉ౦డరాదు ''

ప్రశ్న :-
ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగము - ఎలా
సమా :-
ఈ సమయములోనే తండ్రి తమ ప్రియమైన పిల్లల సన్ముఖములోకి వస్తారు. తండ్రి, టీచరు, సద్గురువుల పాత్ర ఇప్పుడు మాత్రమే నడుస్తు౦ది. ఇది కళ్యాణకారి సమయము, ఈ సమయములో పిల్లలైన మీరు నరకమును స్వర్గముగా తయారు చేయు మతము, అందరికీ సద్గతినిచ్చు అతీతమైన శ్రీమతమును తెలుసుకొని దానిని అనుసరిస్తారు. 
పాట :-
భోలానాథునికి సాటి అయినవారు,............... ( భోలానాథ్‌ సే నిరాలా,.............)   http://bkdrluhar.com/jpg/download.jpg
ఓంశాంతి.
మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - '' స్వయమును ఆత్మగా భావి౦చి తండ్రిని స్మృతి చేయండి''. 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి మన్మనాభవ అని చెప్పారు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావి౦చండి. అ౦దరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? మిమ్ములను మీరు పరమాత్మ అని ఎవ్వరూ భావించుట లేదు కదా? పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అని గాయనము కూడా చేస్తారు. కానీ మహా పరమాత్మ అని అనరు. ఆత్మ పవిత్రమౌతే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. మలినాలు ఆత్మలోనే ఏర్పడుతాయి. తండ్రి కూర్చొని పిల్లలకు యుక్తిగా అర్థం చేయిస్తారు. ఆత్మ రూపములో మనమందరము సోదరులము (భాయి-భాయి). శరీర సంబంధములోకి వస్తే సోదరీ-సోదరులు(భాయి-బహన్‌) - ఇది చాలా ఆవశ్యకమైనది. ఇచ్చట చాలామంది జంటలు కూర్చొని ఉన్నారు. వారికి మీరు పరస్పరము సోదరీ - సోదరులుగా భావి౦చమని చెప్తే వారికి కోపము వస్తు౦ది. మనందరి ఆత్మల తండ్రి ఒక్కరే కనుక ఈ చట్టము(నియమము) తెలియజేయబడుతున్నది. అ౦దువలన అందరూ సోదరులమే. మనుష్య శరీరములోకి వచ్చినప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. కావున తప్పకుండా వారి ముఖవంశావళి పరస్పరము సోదరీ-సోదరులవుతారు. అందరూ పరమపిత పరమాత్మ అని అంటారు. తండ్రి స్వర్గ రచయిత. మనము వారి పిల్లలము. కావున మనము స్వర్గానికి అధిపతులుగా ఎందుకు అవ్వరాదు? కానీ స్వర్గము సత్యయుగములో ఉంటుంది. అంతేగానీ తండ్రి వచ్చి ఏ నూతన సృష్టినీ రచించరు. తండ్రి వచ్చి పాతదానిని క్రొత్తదిగా చేస్తారు. అనగా ఈ విశ్వమంతటినీ పరివర్తన చేస్తారు. కావున ఇచ్చటకు తండ్రి తప్పక వచ్చారు. భారతదేశానికి స్వర్గ వారసత్వమునిచ్చారు. దీని స్మృతి చిహ్నంగానే అన్నిటికన్నా పెద్దగా సోమనాథ మందిరాన్ని కట్టి౦చారు. తప్పకుండా భారతదేశములో ఒకే ఒక దేవీ దేవతా ధర్మముండేది. ఇక ఏ ఇతర ధర్మము లేదు. మిగిలినవన్నీ తర్వాత వృద్ధి చెందినవి. కావున మిగిలిన ఆత్మలన్నీ నిర్వాణధామములో తండ్రి వద్ద ఉంటాయి. భారతవాసులు జీవన్ముక్తులుగా సూర్యవంశ కుటు౦బములో ఉండేవారు. ఇప్పుడు జీవన బంధనములో ఉన్నారు. సెకండులో జీవన్ముక్తి లభించిందని జనకుని ఉదాహరణ కూడా ఉంది. మొత్తం స్వర్గమంతటినీ జీవన్ముక్తి అని అంటారు. అందులో మళ్లీ ఎవరు ఎంత శ్రమ చేశారో అంత పదవి పొందుతారు. అందరినీ జీవన్ముక్తులని అంటారు. అందువలన ముక్తి - జీవన్ముక్తిదాత తప్పక ఒక్క సద్గురువే అయ్యి ఉండాలి. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడైతే అందరూ మాయా బంధనములో ఉన్నారు. ఈశ్వరుని గతి-మతి భిన్నమైనదని కూడా అంటారు. వారు తెలిపేదే శ్రీమతము. వారు తప్పకుండా వస్తారు. చివరిలో అందరూ ఓహో ప్రభూ! అని అంటారు. '' ఓహో ప్రభూ! ఈ నరకాన్ని స్వర్గముగా తయారు చేయు మీ విధానము చాలా భిన్నమైనది'' అని ఇప్పుడు మీరు అంటారు. మనము మళ్లీ సహజ రాజయోగమును నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. కల్పక్రితము కూడా సంగమ యుగములోనే నేర్పించి ఉంటారు కదా. తండ్రి స్వయంగా అంటున్నారు - ప్రియమైన పిల్లలూ, నేను పిల్లలైన మీ సన్ముఖములోకి మాత్రమే వస్తాను. వారు సుప్రీమ్‌ తండ్రే కాక సుప్రీం టీచరు కూడా అయ్యారు. జ్ఞానమిస్తారు ఇతరులెవ్వరూ ఈ సృష్టి చక్ర జ్ఞానమును ఇవ్వలేరు. ఈ సృష్టిచక్ర ఆదిమధ్యా౦తములు లేక ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ స్థాపన-వినాశముల కార్యము ఎలా చేయిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా మార్చు........ ఈ మహిమ వారిదే. మైల పట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారు..... '' మేము మలినమై అపవిత్రముగా ఉన్నామా? లేక పవిత్రముగా ఉన్నామా ?'' అకాల సింహాసనము కదా. అకాలమూర్తి వారి సి౦హాసనము ఎక్కడ ఉంది? అది పరంధామము లేక బ్రహ్మమహాతత్వము. ఆత్మలమైన మనము కూడా అచ్చట ఉండేవారము. దానిని కూడా అకాల సి౦హాసనమని అంటారు. అచ్చటికి ఎవ్వరూ రాలేరు. ఆ స్వీట్‌ హోమ్‌లో(మధురమైన ఇంట్లో) మనము ఉంటాము. తండ్రి కూడా అక్కడే ఉంటారు. పోతే కూర్చునేందుకు అచ్చట ఏ సింహాసనము లేక కుర్చీలు మొదలైనవి ఉండవు. అచ్చట అశరీరులుగా ఉంటారు కదా. కావున సెకె౦డులో జీవన్ముక్తి లభిస్తు౦దని అర్థం చేయించాలి అనగా అర్హులుగా అవుతారు. 

తండ్రి అంటున్నారు - ''శివబాబాను స్మృతి చేయండి మరియు విష్ణుపురమును స్మృతి చేయ౦డి''. ఇప్పుడు మీరు బ్రహ్మపురములో కూర్చొని ఉన్నారు. మీరు బ్రహ్మకు సంతానము మరియు శివబాబాకు పుత్రులు కూడా అయ్యారు. స్వయాన్ని సోదరీ-సోదరులుగా భావి౦చకపోతే కామ వికారానికి వశమౌతారు. ఇది ఈశ్వరీయ కుటు౦బము. మొదట మీరు కూర్చొని ఉన్నారు, తాతగారు కూడా కూర్చొని ఉన్నారు. తండ్రి కూడా ఉన్నారు. మీరు ఆ తండ్రికి పిల్లలు. అందువలన మీరు శివబాబాకు బ్రహ్మ ద్వారా సంతానమయ్యారు. శివునికి పౌత్రులు. మానవ శరీరములో ఉన్నారు కనుక సోదరీ-సోదరులు. ఈ సమయములో మీరు ప్రాక్టికల్‌గా సోదరీ-సోదరులుగా ఉన్నారు. ఇది బ్రాహ్మణ కులము. ఇది బుద్ధితో అర్థము చేసుకునే విషయము. జీవన్ముక్తి కూడా ఒక సెకె౦డులో లభిస్తుంది. పోతే పదవులైతే చాలా ఉన్నాయి. అచ్చట దు:ఖము కలిగి౦చే మాయ ఉండనే ఉండదు. అంతేగానీ సత్యయుగము ను౦డి కలియుగము వరకు రావణుని తగులబెడ్తూ ఉంటారని కాదు. అలా తగులబెట్టరు. పరంపర నుండి కాలుస్తూ వచ్చారనే మాట అసంభవము. స్వర్గములో అసురులు ఎచ్చట ను౦డి వచ్చారు? తండ్రి అంటున్నారు - ఇది ఆసురీ సంప్రదాయము. వారి పేర్లు అకాసురుడు, బకాసురుడు అని ఉంచారు. కృష్ణుడు ఆవులను మేపారని కూడా అంటారు. ఈ పాత్ర కూడా నడుస్తూ ఉంది. శివబాబా ఆవులు మీరే కదా. శివబాబా అందరికీ జ్ఞాన గడ్డి తినిపిస్తున్నారు. గడ్డి తినిపించేవారు, పాలన చేసేవారు వారే(శివబాబాయే). 

మనుష్యులు మందిరాలకు వెళ్లి దేవతలను మహిమ చేస్తారు - '' మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము.....'' స్వయమును దేవతలమని చెప్పుకోలేకున్నారు. హిందువులమని చెప్పుకుంటున్నారు. అసలు పేరు భారతదేశము. గీతలో కూడా యదాయదాహి ధర్మస్య......గీతలో హిందుస్థానమనే పేరు లేదు. ఇది భగవానువాచ. భగవంతుడు ఒక్క నిరాకారుడు మాత్రమే. వారు అందరికీ తెలుసు. స్వర్గములో ఉన్నవారంతా దైవీ గుణాలు కలిగిన మనుష్యులు. వారే 84 జన్మలు తీసుకుంటారు. కావున స్వర్గము నుండి నరకములోకి తప్పకుండా వస్తారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. దానికి కూడా అర్థము ఉంటుంది కదా. నె౦బరువన్‌ పూజ్యులు శ్రీకృష్ణుడు. కిశోర అవస్థను సతోప్రధానమని అంటారు. బాల్యావస్థను సతో అని అంటారు, యువా అవస్థను రజో, వృద్ధాప్యాన్ని తమో అని అంటారు. సృష్టి కూడా సతో, రజో, తమోగా అవుతుంది. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము రావాలి. తండ్రి సంగమ యుగములోనే వస్తారు. ఇది అత్య౦త కళ్యాణకారీ యుగము. మరే యుగము ఈ విధంగా ఉండదు. సత్యయుగము నుండి త్రేతా యుగములోకి వచ్చారు. దానిని కళ్యాణకారి అని అనరు. ఎందుకనగా రెండు కళలు తగ్గిపోతే దానిని కళ్యాణకారి యుగమని ఎలా అంటారు? తర్వాత ద్వాపర యుగములోకి వస్తే కళలు ఇంకా తగ్గిపోతాయి. అందువలన అది కళ్యాణకారి యుగము కాదు. కళ్యాణకారి యుగము ఈ సంగమ యుగము ఒక్కటే. ఈ యుగములో తండ్రి ముఖ్యముగా భారతదేశానికి జనరల్‌గా అందరికీ గతి-సద్గతిని ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి అంటున్నారు - ''ఈ దేవీ దేవతా ధర్మము సుఖమునిచ్చేది''. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. అందుకే వేరు వేరు ధర్మాలలోకి వెళ్లిపోయారు. వాస్తవానికి మీది అన్నిటికన్నా శ్రేష్ఠమైన ధర్మము. ఇప్పుడు మళ్లీ అదే రాజయోగమును నేర్చుకుంటున్నారు. కావున శ్రీమతమును అనుసరించవలసి వస్తుంది. మిగిలినవారంతా ఆసురీ రావణ మతమును అనుసరిస్తున్నారు. అందరిలోనూ పంచ వికారాలున్నాయి. అందులో కూడా మొదటిది అశుద్ధ అహంకారము''. తండ్రి అంటున్నారు - దేహ అహంకారాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి. అశరీరి భవ! మీరు తండ్రినైన నన్ను మర్చిపోయారు. ఇది కూడా భూల్‌-భులయ్యా ఆట(దారిని మర్చిపోయే ఆట లేక భ్రాంతిలో తిరిగే ఆట). క్రింద పడే తీరాలి కదా, మరి పురుషార్థము ఎందుకు చేయాలని చాలామంది అడుగుతారు? అరే! పురుషార్థము చేయకుంటే స్వర్గ రాజ్యము ఎలా లభిస్తు౦ది. డ్రామాను కూడా అర్థము చేసుకోవాలి. ఇదంతా ఒకే సృష్టి, దాని చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగము ఆది సత్యముగానే ఉంటుంది. సత్యమే జరుగుతుంది...... ప్రపంచ చరిత్ర - భూగోళాలు రిపీట్‌ అవుతాయని కూడా అంటారు కూడా. అయితే ఎప్పుడు మొదలవుతుంది? ఎలా రిపీట్‌ అవుతుంది? దాని కొరకు మీరు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి అంటున్నారు - నేను మళ్లీ మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. మీరు కూడా నేర్చుకుంటారు. రాజ్యము జరుగుతుంది. యాదవులు, కౌరవులు సమాప్తమై జయ జయ ధ్వనులు జరుగుతాయి. మరలా ముక్తి - జీవన్ముక్తుల ద్వారాలు తెరచుకుంటాయి. అంతవరకు దారి మూయబడి ఉంటుంది. యుద్ధము ప్రారంభమైనప్పుడే గేట్‌ తెరుచుకుంటుంది. తండ్రి వచ్చి మార్గదర్శకులై తీసుకెళ్తారు. వారు లిబరేటర్‌(ముక్తిదాత) కూడా అయ్యారు. మాయ పంజా నుండి విడిపిస్తారు. గురువుల సంకెళ్ళలో చాలా చిక్కుకొని పోయి ఉన్నారు గురువు ఆజ్ఞ పాటించకపోతే ఏదైనా శాపము లభిస్తుందని చాలా భయపడ్తారు. అరే! మీరు ఆజ్ఞ ఎక్కడ పాటిస్తున్నారు? వారు నిర్వికారులు, పవిత్రులు కాని మీరు వికారులు అపవిత్రులు. గురువులలో మనుష్యులకు చాలా భావన ఉంటుంది. కానీ ఏమి చేస్తారో ఏమీ తెలియదు. ఇదంతా భక్తి మార్గపు ప్రభావము. ఇప్పుడు మీరు తెలివిగల పిల్లలుగా అయ్యారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులని మీకు తెలుసు. వారిలో కూడా బ్రహ్మ నుండి విష్ణు పాత్ర ఇచ్చట ఉంది. శంకరుడు ఇచ్చటకు వచ్చే అవసరమే లేదు. ఇచ్చట జగదంబ, జగత్‌ పిత, పిల్లలైన మీరు ఉన్నారు. అయితే ఇన్ని భుజాలుండే దేవతలను మొదలైనవారిని ఎంతో మందిని కూర్చొని తయారు చేస్తారు. అనేక చిత్రాలున్నాయి. ఈ చిత్రాలన్నీ భక్తిమార్గానికి సంబంధి౦చినవి. మనుష్యులైతే మనుష్యులే. రాధా-కృష్ణులు మొదలైన వారికి కూడా 4 భుజాలు ఇచ్చేస్తారు. దీపావళి పండుగ రోజు మహాలక్ష్మిని పూజిస్తారు, 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణునివి. అందుకే ఇరువురికి కంబై౦డు రూపములో పూజ జరుగుతుంది. ఇది ప్రవృత్తి మార్గము. అంత తప్ప మరేమీ కాదు. కాళికా దేవి నాలుక ఎంత భయంకరంగా చూపుతారు! కృష్ణుని కూడా నల్లగా చేసేశారు. వామమార్గములోకి వెళ్లిపోయినందున నల్లగా అయిపోతారు. మళ్లీ జ్ఞానచితి పై కూర్చున్న౦దున తెల్లగా, పవిత్రంగా అవుతారు. జగదంబ ఇటువంటి మధురమైన మమ్మా అందరూ మనోకామనలను పూర్తి చేసేవారు. వారి మూర్తిని కూడా నల్లగా చేసేశారు. ఎంతో మంది దేవీలను తయారు చేస్తారు. పూజి౦చి సముద్రములో ముంచేస్తారు. కావున ఇది బొమ్మల పూజ అయ్యింది కదా. బాబా అంటున్నారు - ఇవన్నీ డ్రామాలో రచింపబడినవి. మళ్లీ అలాగే జరుగుతాయి. భక్తిమార్గము చాలా విస్తారమైనది. ఎన్నో మందిరాలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో శాస్త్రాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చెప్పలేము. సమయము వృథా...... ధనము దండుగే........ మనుష్యులు ఈ సమయములో పూర్తిగా తుచ్ఛ బుద్ధిగలవారుగా ఉన్నారు. గవ్వ సమానంగా అయిపోతారు. తండ్రి అంటున్నారు - మీరు ఇ౦తవరకు భక్తిమార్గపు ఎదురు దెబ్బలు చాలా తిన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను ఈ చిక్కులన్నిటి నుండి విడిపిస్తారు. కేవలము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. తప్పక పవిత్రంగా కూడా అవ్వాలి. పథ్యము కూడా ఉండవలసి వస్తుంది. లేకుంటే ఎలా౦టి ఆహారమో అలా౦టి మనస్సు తయారవుతుంది. సన్యాసులు కూడా గృహస్థుల వద్ద జన్మ తీసుకోవలసి వస్తుంది. వారిది రజోప్రధాన సన్యాసము, ఇది(మీది) సతోప్రధాన సన్యాసము. మీరు పాత ప్రపంచమును సన్యసిస్తారు. ఆ సన్యాసములో కూడా చాలా బలముంది. ప్రెసిడె౦టు కూడా గురువుల ముందు తల వంచి నమస్కరిస్తున్నారు. భారతదేశము పవిత్రముగా ఉండేది. వారి మహిమ గాయనము చేయబడుతుంది. భారతవాసులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు పూర్తి వికారులుగా ఉన్నారు. దేవతల మందిరాలలోకి వెళ్తే, వారు తప్పక ఆ ధర్మానికి చెందిన వారిగా ఉంటారు. గురునానక్‌ మందిరములోకి వెళ్తే వారు తప్పక సిక్కు ధర్మమువారిగా ఉంటారు కదా. కానీ వీరందరూ స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారమని అనబడరు ఎందుకనగా వారు పవిత్రముగా లేరు. 

ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను మళ్లీ శివాలయాన్ని తయారుచేసేందుకు వచ్చాను. స్వర్గములో కేవలము దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. ఈ జ్ఞానము మళ్లీ ప్రాయ: లోపమైపోతుంది అనగా అదృశ్యమైపోతుంది. గీత, రామాయణము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. డ్రామానుసారము మళ్లీ వాటి సమయములో వస్తాయి. ఇవన్నీ చాలా అర్థము చేసుకునే విషయాలు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే పాఠశాల కానీ మనుష్యులు మనుష్యుల సద్గతిని ఎంత మాత్రము చేయలేరు. అల్పకాలిక సుఖమైతే అందరూ ఒకరికొకరు ఇచ్చుకుంటూనే ఉంటారు. ఇచ్చట అల్పకాల సుఖముంది. మిగిలిన సమయమంతా దు:ఖమే దు:ఖము. సత్యయుగములో దు:ఖమనే మాటే ఉండదు. దాని పేరే స్వర్గము, సుఖధామము. స్వర్గమను పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది. తండ్రి అంటున్నారు - భలే గృహస్థ వ్యవహారములో ఉండండి. కానీ ఈ అంతిమ జన్మలో తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి - ''బాబా నేను మీ పుత్రుడను, ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రమై పవిత్ర ప్రపంచ వారసత్వమును తీసుకుంటాను''. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. మంచిది. 

 మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :- 
1. దేహ అహంకారాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి. 
2. డ్రామాను యథార్థ రీతిలో అర్థం చేసుకొని పురుషార్థము చేయాలి. '' డ్రామాలో ఉంటే చేస్తాములే'' అని ఆలోచించి పురుషార్థ హీనులుగా అవ్వరాదు. 
వరదానము :- '
'' ఇది కళ్యాణకారి సమయమనే స్మృతి ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకొను మాస్టర్‌ త్రికాలదర్శి భవ '' 
ఒకవేళ ఎవరైనా మీ భవిష్యత్తు ఏమిటి? అని అడిగితే వారికి ఇలా చెప్పండి - చాలా బాగుంటుంది, ఎందుకంటే రేపు ఏమవుతుందో మాకు తెలుసు. అది చాలా బాగుంటుంది. జరిగిపోయిందీ బాగుంది, ఇప్పుడేది జరుగుతూ ఉందో అది ఇంకా బాగుంది, ఇక జరగబోయేది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైతే మాస్టర్‌ త్రికాలదర్శి పిల్లలుగా ఉంటారో వారికి ఇది కళ్యాణకారి సమయమని, తండ్రి మన కళ్యాణకారి అని, మనము విశ్వ కళ్యాణకారులమని నిశ్చయముంటుంది. కనుక మనకు అకళ్యాణము జరగజాలదు. 
స్లోగన్‌ :-
'' సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావాలంటే సంపూర్ణమయ్యే పురుషార్థము చేయండి '' 


No comments:

Post a Comment